Begin typing your search above and press return to search.

అంగార‌కుడిపైకి ఇళ్లు క‌ట్టుకోవ‌చ్చు...!

By:  Tupaki Desk   |   3 Oct 2016 2:19 PM GMT
అంగార‌కుడిపైకి ఇళ్లు క‌ట్టుకోవ‌చ్చు...!
X
అంగార‌కుడిపై అపార‌మైన సౌర‌శ‌క్తి ఉంది. మేథేన్‌ - ఆక్సిజ‌న్ వంటి వాయువుల ద్వారా మొక్క‌ల్ని పెంచే అవ‌కాశం ఉంది! అంటే... మార్స్ మీద మ‌నిషి బ‌త‌క‌డానికి కావాల్సిన వాతావ‌ర‌ణం చేసుకోవ‌చ్చా అనే కోణంలో ఎప్ప‌టి నుంచో శాస్త్రవేత్త‌లు పరిశోధ‌న‌లు సాగిస్తున్నారు. మార్స్ మీద మ‌నం కాల‌నీలు నిర్మించుకోవ‌చ్చ‌ని చెబుతున్నారు స్పేస్ ఎక్స్ సంస్థ వ్య‌వస్థాప‌కుడు ఎలాన్ మ‌స్క్‌. మెక్సికోలో జ‌రిగిన 67వ ఆస్ట్రోనాటిక‌ల్ కాంగ్రెస్ లో ఆయ‌న పాల్గొన్నారు. గ్ర‌హాంత‌ర వాతావ‌ర‌ణంలోకి దూసుకెళ్లే రాకెట్ల‌ను రూపొందిస్తున్న‌ట్టు మ‌స్క్ చెప్పారు. వీటి సాయంతో మాన‌వుడు అంగార‌క గ్ర‌హానికి వెళ్లొచ్చ‌ని అంటున్నారు.

ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న టెక్నాల‌జీని ఉప‌యోగించి ఒక వ్య‌క్తి అంగార‌కుని మీద‌కి తీసుకెళ్ల‌డానికీ, అక్క‌డ నివాస యోగ్య‌మైన ప‌రిస్థితులు క‌ల్పించ‌డానికి దాదాపు 1000 కోట్ల డాల‌ర్లు ఖ‌ర్చు అవుతుంద‌ని చెబుతున్నారు! ఈ ఖ‌ర్చును త‌గ్గించే ప్ర‌య‌త్నంలో ఉన్నామ‌న్నారు. ఒక‌సారి మార్స్ మీదికి పంపిన రాకెట్ పున‌ర్వినియోగం సాధ్యాసాధ్యాల‌పై ప‌రిశోధ‌లు చేస్తున్నామ‌నీ, దీని ద్వారా చాలా ఖ‌ర్చు త‌గ్గుతుంద‌ని చెప్పారు. భ‌విష్య‌త్తులో ఎలాగూ సాంకేతిక ప‌రిజ్ఞానం మ‌రింత అభివృద్ధి చెందుతుంది కాబ‌ట్టి... ఖ‌ర్చు స‌హ‌జంగానే బాగా త‌గ్గుతుంద‌ని చెప్పారు.

భూమి నుంచి అంగార‌కుడి మీదికి వెళ్లాలంటే ప్ర‌స్తుతం 80 రోజుల ప్ర‌యాణం ఉంటుంది. అంటే, రాకెట్ లో ఎన‌భై రోజుల ప్ర‌యణం అంటే చాలా బోరు కొడుతుంది క‌దా! పైగా, గురుత్వాక‌ర్ష‌ణ లేని వాతావ‌ర‌ణంలో ఉండాలి. ఈ ప్ర‌యాణం ఏమాత్రం బోరు కొట్ట‌కుండా ఉండేందుకు రాకెట్ లో ఆడుకునేందుకు కొత్త ఆట‌ల్నీ, సినిమాలు చూసుకునే వీలు క‌ల్పించ‌డం కోసం ప్ర‌య‌త్నిస్తున్నాం అని మ‌స్క్ చెప్పారు. స‌రే, మార్స్ మీదికి వెళ్లాలంటే ఇంత వ్య‌య ప్ర‌యాస‌ల‌కు ఓర్చుకున్నాక‌.. అక్క‌డి క్షేమంగా వెళ్లి తిరిగి రాగ‌ల‌మా అనే ప్ర‌శ్న‌కు మ‌స్క్ ఇచ్చిన స‌మాధానం కాస్త ఆశ్చ‌ర్యంగా ఉంది. తొలిబ్యాచ్‌లో మార్స్ మీద నివాసం కోసం వెళ్దాం అనుకుంటున్న‌వారు ప్రాణాలు త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉంటేనే మంచిదంటున్నారు! పోనీ, ఆ ప్ర‌యోగం ఏదో మీరే చేసి తొలి బ్యాచ్ లో మార్స్ మీదికి వెళ‌తారా అని మ‌స్క్ ను అడిగితే ఏం చెప్పారో తెలుసా... ఈ కంపెనీని ఎంతో అభివృద్ధి చేయాల‌నుకుంటున్నాను. కాబ‌ట్టి, అలాంటి సాహ‌సోపేత నిర్ణ‌యం తీసుకోలేనేమో అనిపిస్తోంద‌న్నారు. అన్నీ అనుకున్న‌ట్టుగా జ‌రిగితే 2022లో తొలిబ్యాచ్ మార్స్ మీదికి వెళ్తుంద‌ని ఆయ‌న చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/