Begin typing your search above and press return to search.

ట్విట్టర్ ఉద్యోగులతో ఎలన్ మస్క్.. ఈసారి ఇలా ట్విస్ట్

By:  Tupaki Desk   |   18 Jun 2022 3:30 AM GMT
ట్విట్టర్ ఉద్యోగులతో ఎలన్ మస్క్.. ఈసారి ఇలా ట్విస్ట్
X
ట్విట్టర్ ను కొంటానని ప్రకటించి.. ఆశచూపి.. ఆ సంస్థ అమ్మకానికి రెడీ అయ్యాక పలు కారణాలు చూపి వద్దని దెబ్బతీసిన ప్రపంచంలోనే నంబర్ 1 కుబేరుడు, టెస్లా అధినేత ఎట్టకలేకు ట్విట్టర్ ఉద్యోగులతో మొదటిసారి టౌన్ హాల్ లో చర్చలు జరిపారు.

ఏప్రిల్ లో ట్విట్టర్ ను 44 బిలియన్లకు కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించిన ఎలన్ మస్క్ తొలిసారిగా కంపెనీ ఉద్యోగులతో నేరుగా మాట్లాడారు. మస్క్ మాట్లాడుతూ.. ‘సంస్థ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నాడు. దీంతోపాటు నిర్వహణ వ్యయం కూడా తగ్గిస్తామన్నారు. ‘ది వెర్జ్ నివేదిక ప్రకారం ఎలన్ మస్క్ కంపెనీ ఉద్యోగులతో నేరుగా ఇంటరాక్ట్ అయ్యాడు. వారు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం ఇచ్చాడు.

ఉద్యోగుల తొలగింపుపై ఆయన ప్రశ్నించగా.. కంపెనీకి ఉన్న ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు వస్తోందన్నారు. ఖర్చు తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అయితే ఉద్యోగుల తొలగింపుపై మాత్రం ఎలన్ మస్క్ స్పష్టతనివ్వలేదు. తొలగింపుల ప్రశ్నపై.. ఇది పరిస్థితిపై ఆధారపడి ఉంటుందని ఎలన్ మస్క్ చెప్పుకొచ్చారు.

ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉందని ఎలన్ మస్క్ ఉద్యోగులతో చెప్పుకొచ్చారు. మీ ప్రశ్న చట్టాన్ని ఉల్లంఘించినప్పటికీ ప్రశ్న అడగాలనుకునే సామాన్యుడు ట్విట్టర్ లో పూర్తి అవకాశం పొందాలన్నారు. కంపెనీలో తొలగింపులకు సంబంధించిన ప్రశ్నపై మస్క్ ఎటువంటి అవకాశాన్ని తోసిపుచ్చలేదు. సంస్థ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఎవరైనా సరే కంపెనీకి సహకరిస్తే భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఇది ఉద్యోగి పనితీరు ఆధారంగా ఉంటుందని తెలిపారు. కంపెనీ దృష్టి లాభాలపైనే ఉంటుందన్నారు. ఇది కాకుండా ఈ ఫ్లాట్ ఫారమ్ ను కూడా అప్ గ్రేడ్ చేయాల్సి ఉంటుందన్నారు. ట్విట్టర్ లో ప్రకటనలకు సంబంధించి ప్రకటనల నమూనాలకు తాను వ్యతిరేకం కాదని మస్క్ అన్నారు. కంటెంట్ ను వీలైనంత వినోదాత్మకంగా చేయడంపై దృష్టి పెట్టాలని ప్రకటనదారులకు మస్క్ వివరించాలన్నారు.

మరో ఆరు నెలల్లో పూర్తిగా ఎలన్ మస్క్ చేతికి ట్విట్టర్ వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఫేక్ అకౌంట్ ల గురించి సంబంధిత సమాచారం ఇవ్వాలని మస్క్ డిమాండ్ చేశారు. మస్క్ అభ్యర్థనను ట్విట్టర్ తిరస్కరించింది. దీంతో ట్విట్టర్ డీల్ ను తాత్కాలికంగా హోల్డ్ లో ఉంచినట్లు మస్క్ తెలిపారు.

ట్విట్టర్ డీల్ ను ఎలన్ మస్క్ హోల్డ్ లో పెట్టాడు. ట్విట్టర్ ఫాలోవర్లలో సగం మంది ఫేక్ అనే విషయాన్ని ఆన్ లైన్ ఆడిటింగ్ కంపెనీ స్పార్క్ టోరో తెలిపారు. ట్విటర్ ఆడిటింగ్ టూల్ స్పార్క్‌టోరో ప్రకారం.. ఎలన్ మస్క్ కు ఉన్న 87.9 మిలియన్ల మంది పాలోవర్లలో దాదాపు 48 శాతం మంది నకిలీ అని టైమ్ నివేదించింది.

ఇందులో స్పామ్ ఖాతాలు.. బాట్ ఖాతాలు ఉండి ఉండొచ్చని.. అదీ కాదంటే వారు ట్విట్టర్ ఖాతా చాలా రోజుల నుంచి వాడి ఉండరని తెలిపింది. ప్రస్తుతం మస్క్‌కి ట్విట్టర్‌లో దాదాపు 90 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.మస్క్ మాత్రమే కాదు.. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఫాలోవర్లు 58.4 మిలియన్లు మరియు మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఫాలోవర్ల సంఖ్య మరియు 131.7 మిలియన్లలలో కూడా నకిలీలు ఉన్నారని తేల్చారు. బిల్ గేట్స్ ఖాతాలో 46 శాతం.. ఒబామా ఖాతాలో 44 శాతం మంది నకిలీ ఫాలోవర్లను కలిగి ఉన్నారని సంస్థ తేల్చింది. స్పామ్ నకిలీ ఖాతాల వల్ల ఈ సంస్థను కొనడం లేదని ఎలన్ మస్క్ తెలిపారు.

ట్విట్టర్ ను కొనేందుకు మస్క్ ఈక్విటీ ఫైనాన్సింగ్ ద్వారా 33.5 బిలియన్ డాలర్లు సేకరించారు. రుణాల ద్వారా 13 బిలియన్ డాలర్లను పొందారు. ఆ సమయంలో ట్విట్టర్ షేర్ వాల్యూ 2 శాతం పెరిగి 40.62 డాలర్లకు చేరింది.