Begin typing your search above and press return to search.

ట్విటర్ కొనుగోలుతో కరిగిపోతున్న కుబేరుడి సంపద..!

By:  Tupaki Desk   |   9 Nov 2022 6:31 AM GMT
ట్విటర్ కొనుగోలుతో కరిగిపోతున్న కుబేరుడి సంపద..!
X
ప్రపంచ కుబేరుడు.. టెస్లా అధినేత ఎలాన్ మాస్క్ సంపద రోజురోజుకు కరిగిపోతోంది. అనూహ్య మలుపుల మధ్య ఎలాన్ మాస్క్ ప్రముఖ సోషల్ దిగ్గజ సంస్థ ట్విట్టర్ ను ఇటీవల కొనుగోలు చేశారు. 44 బిలియన్ డాలర్లను చెల్లించి ట్విట్టర్ ను ఎలాన్ మాస్క్ హస్తగతం చేసుకున్న సంగతి అందరికీ తెల్సిందే. అయితే దీని ప్రభావం క్రమంగా అతడి ఆస్తులు కరిగిపోవడానికి కారణమవుతుండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఫోర్బ్స్ లెక్కల ప్రకారంగా ఎలాన్ మాస్క్ సంపద ప్రస్తుతం 194.8 బిలియన్లుగా ఉంది. అలాగే 622 బిలియన్లు డాలర్ల మార్కెట్ కలిగిన టెస్లాలో ఎలాన్ వాటా 15 శాతంగా ఉంది. అయితే ట్విట్టర్ ను కొనుగోలు చేసేందుకు గాను ఎలాన్ మాస్క్ టెస్లా లోని తన వాటాను కొంతమేరకు విక్రయించారు. దీని విలువ సుమారు 4 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా.

ఈ ఏడాది తొలి నుంచే ట్విట్టర్లో వాటాలను కొనుగోలు చేస్తూ వచ్చిన ఎలాన్ మాస్క్ ఏప్రిల్ 3న నాటికి తొమ్మిది శాతం పైగా వాటాను దక్కించుకున్నారు. ఈక్రమంలోనే ట్విట్టర్ లోని ఒక్కో షేరుకు 54.20 డాలర్లను ఆఫర్ చేస్తూ 44 బిలియన్ డాలర్లను ట్విట్టర్ ను కొనుగోలు చేస్తానని ఆఫర్ ఇచ్చాడు. ఈ నిర్ణయంతో టెస్టా కంపెనీ మార్కెట్ సగానికి పైగా పడిపోయింది.

ఎలాన్ మాస్క్ ఆస్తి విలువ ఒక్కసారిగా 70 బిలయన్లకు పడిపోయింది. ట్విట్టర్ కొనుగోలు తర్వాత మాస్క్ టెస్లా కంపెనీపై పెద్దగా దృష్టి సారించకపోవడంతో ఇందులోని ఇన్వెస్టర్లు క్రమంగా పక్కచూపులు చూస్తున్నారు. టెస్లాకు పోటీనిచ్చే ఇతర ఆటో మొబైల్ కంపెనీల్లోకి తమ పెట్టుబడులను మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు.

మదుపర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటుండటంతో టెస్లా వాల్యూ క్రమంగా పడిపోతుంది. నిన్న ఒక్కరోజు 200 బిలియన్ డాలర్ల దిగువకు ఎలాన్ నికర ఆస్తి విలువ పడిపోయింది. దీనికితోడు ట్విటర్ ఉద్యోగులను ఎలాన్ మాస్క్ తొలగించడం... పే ఆప్షన్ తీసుకురానున్నట్లు ప్రకటించడం వంటివి కూడా అతడిపై వ్యతిరేకతకు కారణమవుతూ మార్కెట్ పై ప్రభావం చూపుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే ట్విట్టర్ కొనుగోలు అంశం ఎలాన్ మాస్క్ కు ఏమాత్రం కలిసి రాలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఎలాన్ మాస్క్ మాత్రం ట్విటర్లో అద్భుత అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ పై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. ఎలాన్ మాస్క్ నిర్ణయం సరైనదా? కాదా? అనేది తేలాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే..!

ట్విట్టర్ కొనుగోలుతో ఎలాన్ మాస్క్ ఆస్తులు క్రమంగా తగ్గి పోతున్నప్పటికీ కూడా ప్రపంచ నెంబర్ వన్ కుబేరుడిగా ఎలాన్ మాస్కే ప్రస్తుతానికి కొనసాగుతున్నారు. ఇక రెండో స్థానంలో లగ్జరీ గూడ్స్ అధినేత ఎల్వీఎంహెచ్ బెర్నార్డ్ అర్నాల్డ్ ఉన్నారు. వీరిద్దరి మధ్య తేడా 40 బిలియన్ డాలర్ల తేడా ఉందని పోర్బ్స్ సంస్థ వెల్లడించింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.