Begin typing your search above and press return to search.
ఏలురు మాజీ ఎంపీ మాగంటి బాబు కుమారుడు ఆత్మహత్యాయత్నం!?
By: Tupaki Desk | 4 March 2021 5:16 AM GMTటీడీపీ మాజీ ఎంపీ మాగంటి బాబు కుమారుడు ఆత్మహత్యాయత్నం చేసినట్లు ప్రచారం సాగుతోంది. బుధవారం అర్ధరాత్రి మాగంటి బాబు కుమారుడు మాగంటి రాంజీ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించారని అంటున్నారు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారని సమాచారం
ప్రస్తుతం రాంజీ విజయవాడలోని ఆంధ్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలిసింది.. ఆయన పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం ఆయన్ను వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నట్టు తెలిసింది. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి వుంది.
రామ్‌జీ ఇంతకుముందు టాలీవుడ్ లో చిత్ర నిర్మాణంలో పాలుపంచుకున్నట్టు టాక్ ఉంది.. ప్రముఖ చిత్రనిర్మాత ఎంఎస్ రాజు సహకారంతో యువ హీరో సుమంత్ అశ్విన్ తొలి చిత్రం ‘తునీగా తునీగా’ నిర్మించారని సమాచారం. రాంజీ ఆరోగ్య పరిస్థితిపై మరింత సమాచారం కొన్ని గంటల్లో బయటకు వస్తాయి.