Begin typing your search above and press return to search.
ట్రంప్ కు వ్యతిరేకంగా ఏలూరు.. ఎందుకంటే?
By: Tupaki Desk | 24 Feb 2020 7:15 AM GMTఅగ్రరాజ్యపు అధినేత, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా దేశమంతా ట్రంప్ మేనియాతో ఊగిపోతోంది. ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా అహ్మదాబాద్ లో ట్రంప్ కు స్వాగతం పలుకుతున్నారు.
అయితే ట్రంప్ భారత పర్యటనకు దేశమంతా ఎదురుచూస్తుంటే.. వీళ్లు ట్రంప్ పర్యటనను తీవ్రంగా వ్యతిరేకిస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ట్రంప్ పర్యటనను కమ్యూనిస్టులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పెట్టుబడిదారి వ్యవస్థతో భారతీయ పరిశ్రమను దెబ్బతీయడానికే ట్రంప్ వస్తున్నారని ఆరోపిస్తున్నారు.
కమ్యూనిస్టులే కాదు.. తాజాగా ట్రంప్ పర్యటనకు వ్యతిరేకంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పాడిపరిశ్రమకు చెందిన రైతులు నిరసన తెలిపారు. భారత్ లోకి కోడిమాంసం, పాల వంటి దిగుమతుల మీద అమెరికాకు కొన్ని ప్రత్యేక రాయితీలు ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేంద్రంతీరుకు వ్యతిరేకంగా రైతులు నిరసన తెలిపారు. అమెరికా నుంచి పాడి ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటే తాము తీవ్రంగా నష్ట పోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు.