Begin typing your search above and press return to search.

స్టెప్పులతో మ‌న‌సు దోచేసిన ఎంపీ మాగంటి..!

By:  Tupaki Desk   |   16 Jan 2018 2:58 AM
స్టెప్పులతో మ‌న‌సు దోచేసిన  ఎంపీ మాగంటి..!
X
మైకుల్లో నుంచి వ‌చ్చే కొన్ని పాట‌లు కొత్త ఉత్సాహాన్ని పొంగేలా చేస్తాయి. చుట్టూ మంది ఉన్న‌ప్పుడు వ‌చ్చే మ్యూజిక్ తో అప్ర‌య‌త్నంగా స్టెప్పులు వ‌చ్చేస్తుంటాయి.అలాంటి వేళ‌లో ఏ మాత్రం టెంప్ట్ అయినా వివాదాల్లోకి ఇరుక్కోవాల్సిందే. స్టేజ్ మీద డ్యాన్స్ వేసిన ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు.. అధికారులు వివాదాల్లోకి కూరుకుపోయిన వైనం తెలిసిందే.

సంక్రాంతి వేళ‌.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఎంత హ‌డావుడి ఉంటుందో తెలిసిందే. పెద్ద పండ‌గ్గా అభివ‌ర్ణించే సంక్రాంతి గోదావ‌రి జిల్లాల్లో జ‌రిగినంత బాగా మ‌రెక్క‌డా జ‌ర‌గ‌ద‌నే చెప్పాలి. ఈ మూడు రోజుల పండ‌క్కి.. కృష్ణా.. గోదావ‌రి వాసులు ఏడాదంతా ఎదురుచూస్తంటారు. పండ‌గ వ‌స్తుందంటే చాలు.. మొద‌ల‌య్యే హ‌డావుడి అంతా ఇంతా కాదు. దీనికి తోడు పండ‌గ సంద‌ర్భంగా ఏర్పాటు చేసే కార్య‌క్ర‌మాల్లో సినిమాల్లో చూపించే పండ‌గ సీన్ల‌ను త‌ల‌పిస్తాయి.

తాజాగా కృష్ణాజిల్లా కైక‌లూరులో సంక్రాంతి సంద‌ర్భంగా ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. దీనికి ఏలూరు లోక్ స‌భ స‌భ్యుడు మాగంటి బాబు హాజ‌ర‌య్యారు. లుంగి డ్యాన్స్‌.. డిక్క‌డిక్క లాంటి హుషారైన పాట‌ల‌కు ఆయ‌న రియాక్ట్ అయ్యారు. కాళ్లు.. చేతులు క‌దుపుతూ స్టెప్పులు వేసి అక్క‌డి వాతావ‌ర‌ణాన్ని మ‌రింత హుషారెక్కించారు. సాధార‌ణంగా ఎంపీ స్థానంలో ఉండి స్టేజ్ మీద స్టెప్పులు వేస్తే వివాదంగా మార‌తాయి. దీనికి భిన్నంగా ఆయ‌న త‌న స్టెప్పుల‌తో అక్క‌డి వారి మ‌నసుల్ని దోచుకున్నారు.

ఎందుకిలా ఉంటే.. ఆయ‌న స్టేజ్ మీద త‌న స‌తీమ‌ణి.. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి స్టెప్పులు వేయ‌ట‌మే. బాబు స్టెప్పులు వేసినా.. కామ్ గా ఉన్న మాగంటి బాబు స‌తీమ‌ణి.. ఒక ద‌శ‌లో సింపుల్ గా.. స్టైలీష్ గా వేసిన స్టెప్పులు మ‌రింత శోభ‌నిచ్చాయి. ఏమైనా.. కుటుంబ స‌భ్యులంద‌రితో క‌లిసి త‌న నియోజ‌క‌వర్గ ప్ర‌జ‌ల‌తో ఫ్యామిలీ ఫంక్ష‌న్ మాదిరి జ‌రుపుకున్న‌వేడుక‌ల్లో బాబు అండ్ ఫ్యామిలీ మెంబ‌ర్స్ వేసిన స్టెప్పులు అక్క‌డి వారిని ఫిదా చేసింది.