Begin typing your search above and press return to search.

అనుమతి లేకుండా కరోనాకు చికిత్స .. డాక్టర్‌ మురళీకృష్ణ అరెస్టు !

By:  Tupaki Desk   |   7 Sep 2020 1:50 PM GMT
అనుమతి లేకుండా కరోనాకు చికిత్స .. డాక్టర్‌ మురళీకృష్ణ అరెస్టు !
X
కరోనా లాంటి క్లిష్ట సమయంలో కూడా వైద్యులు తమ ప్రాణాలని సైతం పనంగా పెట్టి ట్రీట్మెంట్ చేస్తున్నారు. అయితే , మరికొందరు వైద్యులు మాత్రం .. తమ హాస్పిటల్ కి అనుమతి లేకున్నా చికిత్స చేస్తున్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండానే కరోనా చికిత్స చేస్తున్నారని ఏలూరు ఎన్ ‌ఆర్ ‌పేటలోని మురళీకృష్ణ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్వాహకులు డాక్టర్‌ మురళీకృష్ణ పై ఏలూరు త్రీటౌన్‌ స్టేషన్‌ లో కేసు నమోదైంది. దీనితో ఏలూరు డీఎస్పీ డాక్టర్‌ ఒ.దిలీప్ ‌కిరణ్‌ పర్యవేక్షణలో ఏలూరు త్రీటౌన్‌ పోలీసులు డాక్టర్‌ మురళీకృష్ణను ఆదివారం రాత్రి అరెస్టు చేశారు.

మురళీకృష్ణ హాస్పిటల్‌ లో ప్రభుత్వ అనుమతి లేకుండానే కరోనా ట్రీట్మెంట్ చేయటం, కొంతమంది మరణానికి కారకులు కావడంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇప్పటికే ఆ హాస్పిటల్‌ ను సీజ్‌ చేశారు. ఈ క్రమంలోనే ఒక బాధితుడు ఏలూరు త్రీటౌన్ ‌లో ఫిర్యాదు చేశాడు. ఏలూరుకు చెందిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్‌ రావటంతో జూలై 23న బాధితుడ్ని మురళీకృష్ణ హాస్పిటల్ ‌లో జాయిన్ చేశారు. అదే నెలలో ఐదురోజుల అనంతరం బాధితుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. వైద్యానికి సుమారుగా రూ.2లక్షల వరకూ వసూలు చేశారని , అలాగే రోగి మృతిచెందిన తరువాత కూడా ఇంజెక్షన్లకు అంటూ మరో రూ.32,500లు వసూలు చేశాడని మృతుడి కుమారుడు హాస్పిటల్ పై ఆరోపణలు చేశాడు. ఆ తర్వాత స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏలూరు డీఎస్పీ డాక్టర్‌ ఒ.దిలీప్ ‌కిరణ్‌ ఆధ్వ ర్యంలో త్రీటౌన్‌ ఎస్ ‌ఐ ప్రసాదకుమార్‌ సిబ్బందితో వెళ్లి డాక్టర్‌ బొర్రా మురళీకృష్ణను అరెస్టు చేశారు. ఆ తర్వాత మేజిస్ర్టేట్‌ ఎదుట హాజరు పర్చారు. ఈ నెల 18 వరకు రిమాండ్‌ విధిం చడంతో భీమవరం సబ్‌ జైలుకు డాక్టర్ ను తరలించారు.