Begin typing your search above and press return to search.
ఎన్ఎస్ఈ మాజీ చీఫ్ చిత్రా రామక్రిష్ణ ఆధ్యాత్మిక గురువు నుంచి అలాంటి ఈమొయిళ్లు?
By: Tupaki Desk | 15 Feb 2022 3:09 AM GMTచిత్రా రామక్రిష్ణ.. దేశంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల్లో ఒకరు. నేషనల్ స్టాక్ ఎక్సైంజ్.. పొట్టిగా చెప్పాలంటే ఎన్ఎస్ఈకి మొట్టమొదటి మహిళా సీఈవోగా వ్యవహరించి చరిత్రను క్రియేట్ చేసిన ఆమె.. సామాన్యుల కంటే కూడా అసమాన్యులకు సుపరిచితం. అలాంటి ఆమెకు సంబంధించి తాజాగా వచ్చిన ఆరోపణలు సంచలనంగా మారాయి. 59 ఏళ్ల ఆమెను ఎన్ఎస్ఈ చీఫ్ స్ట్రాటజిక్ అడ్వైజర్ గా నియమించటం ఒక ఎత్తు అయితే.. తిరిగి గ్రూప్ ఆపరేటింగ్ అధికారిగా.. ఎండీ సలహాదారుగా మార్చటం లాంటి పాలనా పరమైన అంశాల్లో తేడా జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో.. ఈ మొత్తం లెక్క తేల్చేందుకు సెబీ రంగంలోకి దిగింది.
ఈ సందర్భంగా షాకింగ్ అంశాలు బయటకు వచ్చాయి. తనకు గడిచిన 20 ఏళ్లుగా ఎలాంటి భౌతికరూపం లేని ఒక సిద్ధ పురుషుడు.. కోరిన రూపాన్ని ఇట్టే ధరించే శక్తి ఉన్న యోగి తనకు వ్యక్తిగతమైన.. వృత్తిపరమైన మార్గదర్శనం చేశారన్న మాట ఇప్పుడు సంచలనంగా మారింది. సదరు యోగి హిమాలయ పర్వతాల్లో ఉంటారని ఆమె సెబీకి వెల్లడించారు. చిత్రపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో హిమాలయ యోగి ఉదంతం తెర మీదకు రావటం హాట్ టాపిక్ గా మారింది.
ఇదిలా ఉంటే.. ఆరోపణలపై విచారణ జరుపుతున్న సెబీ నుంచి బయటకు వచ్చిన వివరాలు ఇప్పుడు కొత్త దుమారాన్ని రేపేలా మారాయి. ఎందుకంటే.. కనిపించని సదరు ఆధ్యాత్మిక గురువు చిత్రరామక్రిష్ణ శిరోజాల గురించి ఆసక్తిని ప్రదర్శించటం.. జడను వేర్వేరు రకాలుగా వేసుకుంటే మరింత బాగుంటారని చెప్పటం లాంటి మాటలు ఈ మొయిళ్లలో కనిపించటం అవాక్కు అయ్యేలా చేసింది. భౌతికంగా కనిపించని యోగి.. భౌతిక అంశాల మీద ఆసక్తిని ప్రదర్శించటం ఏమిటి? అన్నది ప్రశ్న.
సెబీకి చిత్ర రామక్రిష్ణ అందించిన వివరాలకు.. ఆమెకు వచ్చిన ఈ మొయిళ్లను తనిఖీ చేసిన వారికి భిన్నమైన అంశాలు బయటకు రావటంతో కనిపించని ఆ యోగి ఎవరు? హిమాలయాల్లో ఉండి దిశానిర్దేశం చేసిన వ్యక్తి ఎవరు? అన్నదిప్పుడు ప్రశ్న. అయితే.. సదరు యోగి పుంగవుడి గురించి వివరాలు వెల్లడించేందుకు చిత్రరామక్రిష్ణ అంగీకరించలేదని చెబుతున్నారు. ఇక.. చిత్రతో సదరు యోగి కొన్ని పాటల్ని పంచుకోవటంతో పాటు.. ఇరువురు కలిసి తూర్పు ఆఫ్రికాలోని సీషెల్స్ కు వెళ్లిన వైనాన్ని ఈమొయిళ్లు బయటపెట్టాయి. తాజాగా ఆ వివరాల్ని సెబీ వెల్లడించింది.
అందులో బయటకొచ్చిన సమాచారం ప్రకారం 2015 నుంచి సదరు యోగి పుంగవుడ్ని చిత్ర పలుమార్లు కలుసుకున్నారు. అతడో ఆధ్మాత్మిక శక్తి మాత్రమేనని ఆమె చెబుతున్నారు. అయితే.. అతడి వివరాల్ని వెల్లడించేందుకు ఆమె ససేమిరా అంటున్నారు. అయితే.. తాము చూసిన ప్రతి ఈమొయిల్ వివరాల్ని వెల్లడించలేమని సెబీ పేర్కొంది. అయితే.. సదరు ఆధ్మాత్మిక శక్తి.. ఒక మనిషేనని.. అతడితో కలిసి చిత్రా రామక్రిష్ణ పలు ప్రాంతాలకు వెళ్లారని.. ‘చిల్’ అయ్యారని పేర్కొనటం హాట్ టాపిక్ గా మారింది. 2013 ఏప్రిల్ నుంచి 2016 డిసెంబరు వరకు నేషనల్ స్టాక్ ఎక్సైంజ్ ఎండీగా.. సీఈవోగా చిత్రా రామక్రిష్ణ పని చేశారు. 2018లో ఢిల్లీలోని స్వామిమలై ఆలయంలో సదరు యోగిని ఆమె కలవటంతో పాటు.. పలు పుణ్యస్థలాల్లో పలుమార్లు కలుసుకున్నట్లుగా వెల్లడించారు. సదరు యోగి నుంచి చిత్రకు వచ్చిన ఈమొయిళ్లలో ఏమేం ఉన్నాయన్న వివరాల్ని చూస్తే..
- ఇవాళ నువ్వు చాలా బాగున్నావు. నీ శిరోజాలను పలు రకాలుగా అలంకరించుకోవటం నేర్చుకోవాలి. అప్పుడు మరింత చూడముచ్చటగా ఉంటావు. ఉచిత సలహానే అయినా దీన్ని నువ్వు పాటిస్తావని తెలుసు. మార్చి మధ్యలో కాస్త ఖాళీగా ఉండేలా చూసుకో.
- నీ బ్యాగులు సిద్ధం చేసుకో. వచ్చే నెల సీషెల్స్ కు వెళ్లటానికి ప్లాన్ వేస్తున్నా. నీకు వీలుంటే నాతో రావొచ్చు. ఇదంతా కాంచన్.. భార్గవలతో కంచన్ లండన్ కు వెళ్లే ముందు. నువ్వు న్యూజిలాండ్ కు వెళ్లే ముందు జరుగుతుంది.
- మనం వెళ్లే దారిలో హాంకాంగ్ లేదంటే సింగపూర్ లో ఆగొచ్చు. నీకు ఏమైనా సాయం కావాలంటే చెప్పు.. శేషు అవన్నీ చూసుకుంటాడు.
- నీకు ఈత వస్తే సముద్రస్నానం చేయొచ్చు. టికెట్ల కోసం కంచన్ తో మాట్లాడమని నా టూర్ ఆపరేటర్ కు చెప్పా.
- నేనుపంపిన మకర కుండల పాట విన్నావా? వాటిని కచ్ఛితంగా వినాలి. నీ మనసు నుంచి నీ ముఖంపైకి వచ్చే చిరునవ్వు చూస్తున్నప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంటుంది.
- నిన్న టైం పంచుకోవటం సంతోషంగా ఉంది. నీకోసం నువ్వు చేసే ఈ చిన్న చిన్న విషయాలునిన్ను శక్తివంతంగా.. తక్కువ వయసు అనిపించేలా చేస్తుంది.