Begin typing your search above and press return to search.
అరెస్టైన విద్యార్థుల ఈమెయిల్లలో కీలక అంశాలు
By: Tupaki Desk | 13 Feb 2019 3:17 PM GMTఅమెరికాలో నకిలీ యూనివర్సిటీ ఏర్పాటు...విద్యార్థుల అరెస్టు ఎపిసోడ్ మలుపులు తిరుగుతోంది. ఫార్మింగ్టన్ ఫేక్ యూనివర్సిటీ కేసులో అరెస్ట్ అయిన మిషిగాన్ డిటెన్షన్ సెంటర్ లో ఉన్న వారిలో 16 మంది విద్యార్థులకు అమెరికా కోర్టులో ఊరట లభించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26లోగా స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లేందుకు కోర్టు అనుమతించింది. 20 మందిలో ముగ్గురు విద్యార్థులు(ఇద్దరు ఇండియన్స్, ఒక పాలస్తీనియన్) ముందుగానే వాలంటరీ డిపార్చర్(స్వచ్ఛందంగా స్వదేశాలకు తిరిగి వెళ్లేందుకు) అనుమతి పొందారు.
పే అండ్ స్టే వీసా కుంభకోణంలో అమెరికా ప్రభుత్వం అరెస్టు చేసిన 129 మంది భారతీయ విద్యార్థుల ఈమెయిల్లలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. నకిలీ యూనివర్సిటీలో చేరేలా విద్యార్థులకు పెద్ద ఎత్తున ఆకర్షణల వల వేశారని స్పష్టమవుతోంది. ఓ తెలుగు విద్యార్థితో మెయిల్ ద్వారా యూనివర్శిటీకి చెందిన అలీ మిలానీ అనే వ్యక్తి జరిపిన సంభాషణలో ఈ విషయం స్పష్టమయింది. ‘యూనివర్శిటీ ఆఫ్ ఫర్మింగ్టన్‌పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదాలు. బోధన విషయానికి వస్తే మా యూనివర్శిటీలో వినూత్నమైన వాతావరణం కనపడుతుంది. అంతేకాకుండా మీ సమయానికి తగ్గట్టు క్లాస్ టైమింగ్స్ ఉంటాయి. మీతో మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది’ అని తెలుగు విద్యార్థికి అలీ మిలానీ మెయిల్ చేశారు. తద్వారా ఆ విద్యార్థిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. దీంతో పాటుగా విద్యార్థులకు భరోసా పెరిగేందుకు యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ అనుమతితో విదేశీ విద్యార్థులకు అడ్మిషన్ ఇచ్చే అధికారం ఈ కాలేజీకి ఉందని కూడా ప్రకటించడం గమనార్హం.
ఇలా పూర్తి భరోసా ఇవ్వడం వల్లే ఫార్మింగ్టన్ యూనివర్సిటీ పట్ల మన విద్యార్థులు ఆకర్షితులు అయినట్లు సమాచారం. ఈ అంశాలనే పేర్కొంటూ విద్యార్థులను ఉద్దేశపూర్వకంగా అమెరికా అధికారులు, కొందరు మధ్యవర్తులు బుట్టలో వేసుకున్నారని తెలుగు సంఘాలు, అమెరికా అధికారులు వాదిస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని వారిని విడుదల చేయాలని పలువురు కోరుతున్నారు. కాగా, రాబోయే వారంలో మరికొందరు విద్యార్థులు విడుదల అయ్యే అవకాశం ఉందని సమాచారం.