Begin typing your search above and press return to search.

తెలంగాణలో లాక్ డౌన్ పొడగింపు ... ఆదేశాలు జారీచేసిన హైకోర్టు !

By:  Tupaki Desk   |   9 Jun 2020 4:30 PM GMT
తెలంగాణలో లాక్ డౌన్ పొడగింపు ... ఆదేశాలు జారీచేసిన హైకోర్టు !
X
తెలంగాణలో ఈ మహమ్మారి తీవ్రత రోజురోజుకి మరింతగా వ్యాప్తి చెందుతుంది. లాక్ డౌన్ నుండి కేంద్రం ప్రకటించిన సడలింపులు అమలు చేసిన తరువాత రాష్ట్రంలో కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. ఈ సమయంలో రాష్ట్ర హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ న్యాయ వ్య‌వ‌స్థ లాక్‌ డౌన్‌ ను మ‌రోసారి పొడిగించింది. కోర్టులు, ట్రైబ్యున‌ళ్ల లాక్ ‌డౌన్‌ ను జూన్ 28 వ‌ర‌కు పొడిగిస్తూ హైకోర్టు ఉత్త‌ర్వులు జారీ చేసింది.

కేవలం అత్య‌వ‌స‌ర‌, తుది విచార‌ణ కేసులు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా విచారించాల‌ని జిల్లా కోర్టుల‌కు ఉత్త‌ర్వులు జారీ చేసింది. రెండు వైపుల లాయ‌ర్లు ప్ర‌త్య‌క్ష విచార‌ణ కోరితే జ్యుడిషియ‌ల్ అకాడ‌మీలో ఏర్పాటు చేసుకోవ‌చ్చ‌ని హైకోర్టు స్ప‌ష్టం చేసింది. జిల్లా, మేజిస్ట్రేట్‌ కోర్టులు, ట్రైబ్యునళ్ల లాక్‌డౌన్‌ ఈ నెల 14 వరకు పొడిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

అత్యవసర, కుటుంబ వివాదాలకు సంబంధించిన కేసులను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చేపట్టాలని సూచించింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు మినహా ఇతర జిల్లాల్లో నేరుగా పిటిషన్లను దాఖలు చేసేందుకు వెసులుబాటు కల్పించింది. అలాగే తప్పనిసరిగా కోర్టుల్లో మాస్కులు, శానిటైజేషన్‌ వంటి జాగ్రత్తలు త‌ప్ప‌క పాటించాల‌ని హైకోర్టు కోర్టులను ఆదేశించింది.