Begin typing your search above and press return to search.

దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులు

By:  Tupaki Desk   |   22 April 2021 1:30 PM GMT
దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులు
X
దేశంలో కరోనా కల్లోలంతో ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో పరిస్థితి అల్లకల్లోలంగా మారుతోందని తెలిపింది. నేషనల్ ఎమర్జెన్సీ తరహా పరిస్థితులను ఎదుర్కోంటోంది’ అని సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.

తాజాగా దేశంలో కట్టుదాటిపోతున్న కరోనా కేసులు.. కరోనా నియంత్రణ విషయంలో ఫెయిల్ అయిన కేంద్రప్రభుత్వం తీరును గమనించి సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటాగా స్వీకరించింది. విచారణలో భాగంగా వైరస్ కట్టడికి జాతీయ ప్రణాళిక అవసరమని చీఫ్ జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

కేంద్రం తీరుపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. గడిచిన 24 గంటల్లో 3.14 లక్షల కేసులు నమోదు కావడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సమస్యపై విచారణ జరపాలనుకుంటున్న బాబ్డే తెలిపారు.

కరోనాకు మందుల కొరత తీవ్రంగా ఉందని.. వ్యాక్సినేషన్ జరగడం లేదని.. ఆక్సిజన్ లేక కరోనా రోగులు చనిపోతున్నారని సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై వెంటనే ప్రణాళికలను రూపొందించాలని కేంద్రప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. వెంటనే వీటిపై సమగ్రంగా అఫిటవిట్ దాఖలు చేయాలని చీఫ్ జస్టిస్ బొబ్డే కేంద్రాన్ని ఆదేశించారు. సలహాలు ఇచ్చేందుకు గాను సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వేను అమికస్ క్యూరీగా నియమించారు.