Begin typing your search above and press return to search.
ఇందిరమ్మది తప్పని తేల్చేసిన కాంగ్రెస్ నేత
By: Tupaki Desk | 21 Oct 2015 4:11 AM GMTఅంతర్గత ప్రజాస్వామ్యం కాస్తంత ఎక్కువగా ఉందని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీలో.. తాజాగా ఒక సీనియర్ నేత చేసిన వ్యాఖ్య ఇబ్బందికరంగా మారింది. మాజీ కేంద్రమంత్రిగా.. మేధావిగా.. కాంగ్రెస్ అధినాయకత్వానికి సన్నిహితుడిగా పేరుకున్న జైరాం రమేష్ ఇందిరమ్మ చేసిన పనిని తప్పుపట్టారు.
అత్యయిక పరిస్థితిని విధించాలన్న నిర్ణయం తీసుకోవటంలో ఇందిర తప్పు చేశారని తేల్చేశారు. ఎమెర్జెన్సీ విధించాలన్న ఇందిర నిర్ణయంతోనే ఆర్ ఎస్ ఎస్ భారత రాజకీయాల్లోకి వచ్చిందని.. ప్రధాన స్రవంతిలో భాగస్వామిగా మారిందని ఆయన చెబుతున్నారు. అత్యయిక పరిస్థితి విధించటం ద్వారా ఇందిర తప్పు చేశారని తేల్చిన ఆయన.. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని ముందుజాగ్రత్త మాటను కూడా చెప్పేశారు.
ఎమర్జెన్సీ నిర్ణయం కారణంగా.. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ హతమార్చిందన్న నింద మోపే అవకాశాన్ని ఇందిర ఇచ్చారని.. ధీని కారణంగానే ప్రధాని మోడీ.. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ లాంటి వారికి ప్రజాస్వామ్య నేతలుగా మారే అవకాశం కల్పించిందని చెప్పుకొచ్చారు. సొంత పార్టీ నేతల్ని కాంగ్రెస్ వారు తిట్టినంత ఘాటుగా.. విమర్శించినట్లుగా మరే పార్టీ నేతలు చేయలేరేమో.