Begin typing your search above and press return to search.
5 నుంచి 12 ఏళ్ల పిల్లలకు అత్యవసర వ్యాక్సినేషన్..!
By: Tupaki Desk | 24 April 2022 1:30 AM GMTకరోనా మహమ్మారి నుంచి పౌరులను కాపాడేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. ఒక వైపు వైరస్ ను కట్టడి చేసేందుకు ఆంక్షలు అమలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. మాస్కులు, భౌతిక దూరం లాంటి నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా పౌరుల్లో అవగాహన తీసుకువచ్చాయి. మరో వైపు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముమ్మరంగా సాగిస్తున్నాయి.
మొదట 45 ఏళ్ల పైబడిన వారికి, తీవ్ర జబ్బులు ఉన్న వారికి టీకాలు పంపిణీ చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రమంగా అందరికీ అందిస్తున్నాయి. 18 ఏళ్ల వయస్సు ఉన్న వారికి వ్యాక్సిన్లు ఇచ్చాయి. అనంతరం 12 ఏళ్ల నుండి 18 ఏళ్ల వయస్సు వారికి దశల వారీగా వ్యాక్సిన్ అందించాయి. 12-18 ఏళ్ల పిల్లలకు కార్బొవాక్స్ కరోనా టీకా ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇప్పటికే 12 ఏళ్లు పైబడిన వారికి కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతుండగా.. ఇప్పుడు పిల్లలకు టీకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చాయి. ఇప్పుడు 5 నుంచి 12 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారుల వ్యాక్సినేషన్ కార్యక్రమంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాయి. అందులో భాగంగా.. ఇవాళ నిపుణుల కమిటీ సమావేశం అయింది.
5 నుంచి 12 ఏళ్ల వారికి వ్యాక్సిన్ ఇచ్చే అంశంపై చర్చించింది. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో 5 నుండి 12 ఏళ్ల మధ్య పిల్లలకు టీకాలు ఇచ్చే అంశంపై నిపుణులు చర్చించారు. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో 5 నుండి 12 ఏళ్ల మధ్య వయస్సున్న పిల్లలకు అత్యవసర వ్యాక్సిన్ అనుమతి ఇచ్చే అంశంపై నిపుణులు చర్చించారు.
భారత దేశపు మొట్ట మొదటి ప్రొటీన్ సబ్- యూనిట్ కరోనా వ్యాక్సిన్ 5-12 సంవత్సరాలు పిల్లల్లో అత్యవసర ఉపయోగం కోసం సిఫార్సు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇక 5 ఏళ్లు పైబడిన వారికి బయోలాజికల్-ఈ... తయారు చేసిన కార్బెవాక్స్ ను అత్యవసరంగా ఉపయోగించాలని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా-DCGIకు నిపుణులు సూచించారు.
నిపుణులు చేసిన సిఫార్సులను డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు పంపించారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ చిన్న పిల్లలకు వ్యాక్సిన్ పై ముందుకు వెళ్లే ముందు డ్రగ్ కంట్రోలర్ ఆమోదం కోసం వేచి ఉండాల్సి ఉంటుంది. ప్రస్తుతం కార్బొవాక్స్ వ్యాక్సిన్ ను 12 నుండి 14 ఏళ్లలోపు పిల్లలకు వేస్తున్న విషయం తెలిసిందే. అయితే చిన్న పిల్లలకు కరోనా టీకా వేయాలని చెప్పేంత వరకు వారిని జాగ్రత్తగా చూస్కోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బయట ప్రాంతాలకు ఎక్కువగా తీసుకుపోకపోవడమే మంచిదని చెబుతున్నారు.