Begin typing your search above and press return to search.

ఆ ఫ్లైట్ జ‌ర్నీ కంటే క్లీన్ చేయ‌టానికే ఎక్కువ టైం!

By:  Tupaki Desk   |   2 July 2019 5:51 AM GMT
ఆ ఫ్లైట్ జ‌ర్నీ కంటే క్లీన్ చేయ‌టానికే ఎక్కువ టైం!
X
విమాన స‌ర్వీసులు అందించే సంస్థ‌ల్లో మొన‌గాడు ఫ్లైట్ స‌ర్వీసుగా ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ కు పేరుంది. ఈ సంస్థ అందించే సేవ‌ల నాణ్య‌త వంక పెట్ట‌లేని రీతిలో ఉంటాయ‌ని చెబుతారు. ప్ర‌పంచంలోనే అతి త‌క్కువ దూరానికి విమాన సేవ‌లు అందిస్తుంద‌న్న పేరున్న ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ తాజాగా మ‌రో రికార్డును సృష్టించింది.

ప్ర‌పంచంలోనే అతి త‌క్కువ దూర‌మైన దుబాయ్-దోహాల మ‌ధ్య విమాన స‌ర్వీసుల్ని న‌డిపే ఈ సంస్థ తాజాగా దుబాయ్-మ‌స్క‌ట్ మ‌ధ్య కొత్త స‌ర్వీసును షురూ చేసింది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. ఈ త‌క్కువ దూరానికి ఎ380 విమాన సేవ‌ల్ని వినియోగిస్తున్నారు. భారీగా ఉండే ఈ విమానం దుబాయ్ -మ‌స్క‌ట్ మ‌ధ్య ప్ర‌యాణం కేవ‌లం 40 నిమిషాల్లో ముగుస్తుంది. ఈ రెండు ప్రాంతాల మ‌ధ్య దూరం కేవ‌లం 340 కిలోమీట‌ర్లు కావ‌టం గ‌మ‌నార్హం.

మ‌రింత ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. ఈ భారీ విమానాన్ని శుభ్రం చేయ‌టానికి 42 మంది సిబ్బంది 35 నిమిషాల పాటు క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంద‌ట‌. అంటే.. 40 నిమిషాల జ‌ర్నీకి 35 నిమిషాలు క్లీన్ చేయాల్సిన ప‌రిస్థితి. మ‌రో ఇంట్ర‌స్టింగ్ విష‌యం ఏమంటే.. ఈ జెయింట్ ఫ్లైట్ లోని తీగ‌ల పొడ‌వు ఏకంగా 500 కిలోమీట‌ర్లుగా చెబుతున్నారు. ఇంత భారీ విమానాన్ని ఇంత త‌క్కువ దూరానికి ఫ్లైట్ స‌ర్వీసును న‌డ‌ప‌టం విశేషంగా చెప్పాలి.