Begin typing your search above and press return to search.
ఆ యువరాజు దేశం విడిచి పారిపోయాడు!
By: Tupaki Desk | 17 July 2018 4:30 AM GMTరాజ్యం.. అందులో రాజులు. కుటుంబంలో వివాదాలు.. చిక్కుల్లో యువరాజు.. లాంటి కథల్ని చాలానే చదివి ఉంటారు. ఇంచుమించు అలాంటి సీనే తాజాగా యూఏఈలో చోటు చేసుకుంది. ఆ దేశానికి చెందిన యువరాజు షేక్ రషీద్ బిన్ హమద్ అల్ షార్కి అనే 31 ఏళ్ల యువరాజు ప్రస్తుతం దేశం విడిచి పారిపోయి.. ఖతార్ లో ఆశ్రయం పొందుతున్నాడు. యూఏఈలో మిగిలిన రాజవంశీకులతో తనకున్న మనస్పర్ధల కారణంగా చంపేస్తారేమోనన్న భయంతో ఖతార్ కు వెళ్లిపోయినట్లుగా న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.
యూఏఈలోని ఫుజైరా ఎమిరేట్స్ రాజు రెండో కొడుకే రషీద్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ను ఏర్పాటు చేసిన ఏడుగురు రాజుల్లో ఆయన తండ్రి ఒకరు. ఈ దేశంలో అబుదాబి యూఏఈకి రాజధాని మాత్రమే కాదు.. అత్యంత సంపన్నమైన ప్రాంతం. అబుదాబి పాలకులతో తనకు వచ్చిన వివాదంతో తనకు ప్రాణహాని ఉందన్నది రషీద్ వాదన. వారు బ్లాక్ మెయిలింగ్‌కు.. మనీలాండరింగ్‌కు పాల్పడుతున్నట్లుగా తీవ్ర ఆరోపణలు చేశారు.
అయితే.. తన ఆరోపణలకు తగిన ఆధారాల్ని చూపించలేదు. యెమన్ తో యుద్ధానికి యూఏఈ బలగాలు పంపటంతో దేశ వ్యాప్తంగా రాజకుటుంబాల్లో ఒత్తిళ్లు ఉన్నట్లుగా చెప్పాడు. యుద్ధ మరణాల గురించి యూఏఈ ప్రకటించిన దాని కంటే ఎక్కువగా ఉంటాయని.. ఆ సంఖ్య చాలా ఎక్కువని చెప్పాడు. ముఖ్యంగా ఫుజైరా ఎమిరేట్స్ కు చెందిన చాలామంది మరణించినట్లుగా వెల్లడించారు. ఈ వాదనపై యూఏఈ అధికారులను మీడియా సంప్రదించగా వారు సమాధానం చెప్పేందుకు నిరాకరించటం గమనార్హం.
ఇదిలా ఉండగా.. ఆ మధ్య ఖతార్ తో పలు అరబిక్ దేశాలు (సౌదీ అరేబియా.. ఈజిఫ్టు.. బహ్రెయిన్.. యూఏఈ) సంబంధాలు తెంచుకోవటం తెలిసిందే. తీవ్రవాదులతో సన్నిహిత సంబంధాలతోనే తామీ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా సదరు దేశాలు చెబుతున్నాయి. అయితే.. ఈ వాదనను ఖతార్ ఖండిస్తోంది. గడిచిన 47 ఏళ్లలో యూఏఈలోని ఏడు రాజకుటుంబాల్లోని ఒకరు దేశ పాలకులపై ఆరోపణలు చేయటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. యువరాజు ప్రాణహాని ఉందంటూ దేశం విడిచి పారిపోవటం ఇప్పుడు సంచలనంగా మారింది.