Begin typing your search above and press return to search.

మెక్రాన్ కు షాకిచ్చిన ఫ్రాన్స్ ప్రజలు.. ఎన్నికల ఫలితాల్లో ఎదురుదెబ్బ

By:  Tupaki Desk   |   21 Jun 2022 4:15 AM GMT
మెక్రాన్ కు షాకిచ్చిన ఫ్రాన్స్ ప్రజలు.. ఎన్నికల ఫలితాల్లో ఎదురుదెబ్బ
X
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మూన్యుయేల్ మెక్రాన్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయన సర్కారు అనూహ్య రీతిలో ఎన్నికల్లో మెజార్టీని సొంతం చేసుకోలేక చతికిల పడిన పరిస్థితి.

2000లో వచ్చిన ఎన్నికల సంస్కరణల అనంతరం దిగువ పార్లమెంటులో మెజార్టీ సాధించని మెదటి సిట్టింగ్ అధ్యక్షుడిగా మెక్రాన్ చరిత్రలో నిలిచిపోనున్నారు. అహంకార ప్రభుత్వంగా విమర్శలు ఎదుర్కొంటున్న మెక్రాన్ ప్రభుత్వానికి తాజా ఫలితాలు ఎదురుదెబ్బగా మారాయి.

ఫ్రాన్స్ పార్లమెంటు నేషనల్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాల్లో అధ్యక్షుల వారి కూటమి తన చేతిలో ఉన్న స్థానాలు కోల్పోగా.. మితవాద పార్టీల కూటమి అనూహ్యంగా పుంజుకోవటం గమనార్హం.

అదే సమయంలో ఫ్రాన్స్ లో జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో అతివాద వామపక్ష నేత జీన్ లూక్ మెలెన్ చోన్ ఆధ్వర్యంలోని న్యూప్స్ గతంలో కంటే ఎక్కువ సీట్లు గెలుచుకోవటం గమనార్హం.

పార్లమెంటు నేషనల్ అసెంబ్లీలో మొత్తం 577 స్థానాలు ఉంటే 245 సీట్లు మెక్రాన్ సంకీర్ణ ప్రభుత్వానికి దక్కాయి. జాతీయ అసెంబ్లీలో సంపూర్ణ మెజార్టీకి 289 సీట్లు అవసరం.

2000లో వచ్చిన ఎన్నికల సంస్కరణల అనంతరం దిగువ పార్లమెంటులో మెజార్టీ సాధించలేకపోయిన మెక్రాన్.. అధికారానికి దూరం కానున్నారు. మెక్రాన్ మీద తరచూ కారాలు మిరియాలు నూరే మెలెన్ చోన్ మాట్లాడుతూ.. అహంకార అధ్యక్షుడిగా ప్రజలు సరైన తీర్పు ఇచ్చినట్లుగా మండిపడ్డారు. తాజా ఫలితాల నేపథ్యంలో హంగ్ పరిస్థితి. మరేం జరుగుతుందో చూడాలి.