Begin typing your search above and press return to search.
ఆ ఎమోజీలు వాడితే అడ్డంగా బుక్ అయినట్లే..
By: Tupaki Desk | 31 Oct 2019 4:41 AM GMTమాటలు తగ్గి.. మెసేజ్ లతో సంభాషించుకునే రోజులు ఈ మధ్యన ఎక్కువ అయ్యాయ్. వీడియో కాలింగ్ కు అవకాశం ఉన్నా.. సందేశాలతో చెప్పాలనుకున్న మాటను చెప్పే తీరు అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా.. గుట్టుగా తాము చెప్పుకోవాల్సిన అంశాల్ని షేర్ చేసుకోవటానికి చాటింగ్ కు మించింది లేదు. అందుకే..మాధ్యమం ఏమైనా.. చాటింగ్ కొత్త పుంతలు తొక్కుతోంది.
ఇటీవల కాలంలో వచ్చిన మార్పు.. చాటింగ్ లో తాము చెప్పాలనుకున్న విషయాన్ని మాటల్లో కాకుండా ఎమోజీలతో చెప్పే ట్రెండ్ గడిచిన కొంతకాలంగా నడుస్తోంది. అయితే.. ఇలా ఎమోజీలతో మాట్లాడే వారంతా ఇప్పుడు అలెర్ట్ కావాల్సిన టైం వచ్చేసింది. ఎందుకంటే.. ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ కొత్త నిబంధనల్ని తీసుకొచ్చింది.
దీని ప్రకారం ఎమోజీల్ని వాడే విషయంలో కొన్నింటి విషయంలో బ్యాన్ విధించింది. సదరు ఎమోజీల్ని వాడిన వారి అకౌంట్లను సస్పెండ్ చేసే ప్రమాదం పొంచి ఉందంటున్నారు. సోషల్ మీడియాలో అభ్యంతరకర ఫోటోలు.. వీడియోల ప్రచారానికి అడ్డుకట్ట వేసేందుకు వీలుగా ఫేస్ బుక్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. లైంగిక వాంఛల్ని ప్రతిబింబించేలా కొన్ని ఎమోజీలను ఫేస్ బుక్.. ఇన్ స్టాలో బ్యాన్ చేసింది.
తాజాగా నిషేధం ఎదుర్కొంటున్న ఎమోజీల విషయానికి వస్తే.. నీటి బొట్టు.. వంకాయ.. పీచ్. వీటిని ఏ సందర్భంలో వినియోగించినా.. ఫేస్ బుక్ సదరు అకౌంట్ ను స్క్రీనింగ్ చేయటమే కాదు.. సస్పెండ్ చేసే ప్రమాదం పొంచి ఉంది. ఫేస్ బుక్ తాజాగా తీసుకొచ్చిన నిబంధనల్లో సెక్షన్ 8కి చేసిన కొత్త సవరణల ప్రకారం.. ఇతరులతో ఛాట్ చేసే సమయంలో కానీ పోస్టులు పెట్టే వేళలో కానీ లైంగిక వాంఛల్ని ప్రతిబించేలా ఉండే ఎమోజీలను అనుమతించరు. ఇందుకు భిన్నంగా ఎవరైనా పోస్ట్ చేసినా.. ఛాటింగ్ లో వాడినా వారి అకౌంట్లను సస్పెండ్ చేయనున్నారు.
ఎందుకిలా అంటే.. సోషల్ మీడియాలో శృంగారాన్ని ప్రతిబింబించేలా ఉండే పోస్టింగ్‌ల ద్వారా తాను ఎన్నో ఇబ్బందులు ఎదురుకుంటున్నానని ప్రముఖ సెలబ్రిటీ రాపర్ కేన్ వెస్ట్ కంప్లైంట్ చేసినంతనే ఫేస్ బుక్ ఈ తరహా నిర్ణయాన్ని వెల్లడించటం విశేషం.
ఇంతకీ.. ఈ పెద్ద మనిషి ఎవరంటారా? హాలీవుడ్ సెక్స్ బాంబ్.. తన ఎక్స్ పోజింగ్ ఫోటోల్ని తరచూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టు చేసే సుందరాంగి కిమ్ కర్ధాషియిని ఉందిగా. ఆమెగారి భర్త. అవిడేమో.. సెక్సీ ఫోటోల్ని విచ్చలవిడిగా పోస్టు చేస్తుంటే ఏమీ ఉండదు కానీ.. వంకాయ.. వాట్ డ్రాప్.. పిచ్ లాంటి బొమ్మల్ని వాడేస్తే.. వారి అకౌంట్లను సస్పెండ్ చేసే వరకూ వెళ్లటమా అని ఫేస్ బుక్ నిర్ణయాన్ని పలువురు తప్పు పడుతున్నారు. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా ఎమోజీలు వాడే వేళ... మీరు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి.