Begin typing your search above and press return to search.

బ్యాంకుల ప్రైవేటీకరణపై ఉద్యోగుల ఆందోళన నిర్మల క్లారిటీ

By:  Tupaki Desk   |   18 March 2021 1:53 PM GMT
బ్యాంకుల ప్రైవేటీకరణపై ఉద్యోగుల ఆందోళన నిర్మల క్లారిటీ
X
రభుత్వ రంగ సంస్థలన్నింటిని ప్రైవేటు పరం చేస్తున్న కేంద్రంలోని మోడీ సర్కార్ తాజాగా బ్యాంకులపై పడింది. ఇప్పటికే పలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. బ్యాంకింగ్ రంగంలోనూ రెండు బ్యాంకులను ప్రైవేటీకరించబోతున్నట్లు వెల్లడించింది.

ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రెండు రోజుల బ్యాంకు సమ్మె కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణపై తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదని నిర్మల స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో పలు బ్యాంకులు కార్యకలాపాలు సాగిస్తున్నాయని.. వాటిల్లో కొన్ని బాగా పనిచేస్తుంటే.. మరికొన్ని ఫర్వాలేదన్నట్టు ఉన్నాయని.. ఎస్.బీ.ఐ తరహాలో మన దేశ అవసరాలను తీర్చగల బ్యాంకులు మనకు కావాలి అని సీతారామన్ తెలిపారు.

ప్రైవేటీకరణ తర్వాత కూడా ఉద్యోగ ప్రయోజనాలకు భద్రత కల్పిస్తామని.. ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లపై తగు జాగ్రత్తలు తీసుకుంటామని నిర్మల తెలిపారు. సుధీర్ఘ మేధోమదనం తర్వాతే ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.బ్యాంకులకు పెట్టుబడులు కావాలని.. ప్రైవేటీకరణ తర్వాత ఉద్యోగుల ప్రయోజనాలు కాపడుతామని నిర్మల తెలిపారు. వేతనాలు, పెన్షన్లపై తగు జాగ్రత్తలు తీసుకుంటామని నిర్మల క్లారిటీ ఇచ్చారు.