Begin typing your search above and press return to search.

ఉద్యోగుల డిమాండ్ హెచ్ ఆర్ ఏ.. ఇది సాధ్య‌మేనా..?

By:  Tupaki Desk   |   22 Jan 2022 2:30 PM GMT
ఉద్యోగుల డిమాండ్ హెచ్ ఆర్ ఏ.. ఇది సాధ్య‌మేనా..?
X
ఏపీలో ఉద్యోగులు చేస్తున్న నిర‌స‌నల్లో ప్ర‌ధాన డిమాండ్‌.. హౌస్ రెంట్ అలవెన్స్‌(హెచ్ ఆర్ ఏ) ప్ర‌స్తుతం ప్ర‌బుత్వం ప్ర‌క‌టించిన పీఆర్ సీ ప్ర‌కారం.. బేసిక్ పే పెరుగుతుంది. కానీ.. హెచ్ ఆర్ ఏ మాత్ర‌మే త‌గ్గుతుంది. దీంతో వేత‌నం త‌గ్గిపోయిన‌ట్టు క‌నిపిస్తోంది. వాస్త‌వానికి హెచ్ ఆర్ ఏ పెంచ‌డం సాధ్య‌మేనా? ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఈ నిర్ణ‌యం తీసుకుంటే.. ఉద్యోగుల మాట ఎలా ఉన్నా.. మిగిలిన వారి ప‌రిస్థితి ఏంటి? అనేది.. మేధావుల ప్ర‌శ్న‌.

ఉదాహ‌ర‌ణ‌కు ఒక ఉద్యోగి పాత‌-కొత్త వేత‌నం చూద్దాం..

డిశంబర్ నెల పాత జీతం
--------------------------------------
Basic Pay - 48600
DA 53.45%. - 25976
(Included
Five da’s)
HRA 20%. - 9720
IR 27%. - 13122
Total = 97418

ఇక కొత్త జీతం
—————————————
JANUARY 22 New salary
———————————————
Basic Pay - 74770
(23% fit)
DA five da’s. - 14969
(20.02%)
HRA 8%. - 5982
TOTAL. = 95721

January 22 తేడా=. -1697
--------------------------------

దీనిని బ‌ట్టి తేడా ఎక్క‌డ క‌నిపిస్తోంది..అంటే ఇంటి అద్దె భ‌త్యంలోనే! బేసిక్ పేలు పెరిగినప్పుడు.. అందులో శాతాన్ని బట్టి గణించే హెచ్ఆర్ఏ పెంచడం ఎలా సాధ్యం? అనేది ఇప్పుడు ప్ర‌శ్న‌. పైన పేర్కొన్న ఉదాహ‌ర‌ణే తీసుకుంటే. డెబ్భయి వేల జీతం తీసుకుంటున్న ఉద్యోగికి ఇప్పుడు లక్ష జీతం అయితే.. దానితో పాటు హెచ్ఆర్ఏ పెంచితే.. గతంలో ఇరవై వేలు ఉన్నది కాస్తా.. ఇప్పుడు ముప్ఫయి వేలు అవుతుంది.

ఒక చిన్న పట్టణానికి ప్రభుత్వం నిర్ణయించిన ఇంటి అద్దె ముప్ఫయి వేలు అని నిర్ధరణ అయితే.. ప్రభుత్వోద్యోగుల సంగతి తర్వాత.. మిగిలిన సామాన్యులకు దొరికే అద్దెఇళ్లు కూడా అద్దెలు పెరుగుతాయి కదా. అందరూ సగటు ఇంటి అద్దె ముప్ఫయి వేలు చేసి కూర్చుంటే.. గవర్నమెంటు ఉద్యోగం లేని వారు ఎలా బతకాలి? అసలు సాధ్యమేనా? అనేది పెద్ద ప్రశ్న. హెచ్ఆర్ఏ గురించి ఉద్యోగులు పట్టుబట్టడం స‌రికాద‌ని మేధావులు సైతం.. అంటున్నారు. ఇది అన్ని వ‌ర్గాల‌పై ప్ర‌భావం చూపుతుంద‌ని చెబుతున్నారు.