Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ పుట్టిన రోజు వేడుక‌ల్లో పాల్గొన్నాడ‌ని ఉద్యోగి తొల‌గింపు!

By:  Tupaki Desk   |   2 Aug 2022 6:33 AM GMT
ప‌వ‌న్ పుట్టిన రోజు వేడుక‌ల్లో పాల్గొన్నాడ‌ని ఉద్యోగి తొల‌గింపు!
X
వైఎస్సార్సీపీ నేత‌లు ప‌దే ప‌దే చెప్పే మాట‌.. ప‌వ‌న్ ప్ర‌భావం ఏపీలో ఏమాత్రం లేద‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న‌కు గుండు సున్నానే అని. కానీ నోరు ఒక‌టి చెప్తే వారి చెయ్యి ఒక‌టి చేస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కాపు సామాజిక‌వ‌ర్గం నుంచి వైఎస్సార్సీపీకి ఒక్క శాతం ఓట్లు కూడా రావ‌ని తేలిపోవ‌డంతో ఆ పార్టీ నేత‌లు త‌ట్టుకోలేక‌పోతున్నార‌ని చెబుతున్నారు. కాపులు ఓట్లేయ‌క‌పోతే వైఎస్సార్సీపీకి 175కి 175 ఏమో కానీ అస్స‌లు అధికారంలోకి రావ‌డం కూడా క‌ష్ట‌మని అంటున్నారు. ఎందుకంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో మొత్తం 75 నియోజ‌క‌వ‌ర్గాల్లో కాపుల‌దే ఆధిప‌త్యం. వారు అక్క‌డ ఎవ‌రికి ఓట్లేస్తే వారు మాత్ర‌మే గెలుస్తారు.

ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల‌ను వైఎస్ఆర్సీపీ టార్గెట్ చేసింద‌నే చ‌ర్చ న‌డుస్తోంది, గుంటూరు జిల్లా న‌ర‌స‌రావుపేట‌లో ఆళ్ల కోటేశ్వ‌ర‌రావు ఎప్ప‌టి నుంచో ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమాని. ఆయ‌న న‌ర‌స‌రావుపేట ఇండోర్ స్టేడియంలో అటెండ‌ర్ గా ప‌నిచేస్తున్నారు. రెండేళ్ల క్రితం ఆయ‌న ప‌వ‌న్ క‌ల్యాణ్ పుట్టిన రోజు వేడుక‌ల్లో పాల్గొన్నార‌ని వైఎస్సార్సీపీ నేత‌లు ఆయ‌న‌ను కక్ష గ‌ట్టి స‌స్పెండ్ చేయించారు.

అప్ప‌టి నుంచి ఆళ్ల కోటేశ్వ‌ర‌రావుకు ఉద్యోగం ఇవ్వ‌కుండా వేధిస్తున్నారు. తాజాగా గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో భాగంగా న‌ర‌స‌రావుపేట వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస‌రెడ్డి ఇంటింటికీ తిరుగుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ విష‌యాన్ని కోటేశ్వ‌ర‌రావు త‌ల్లిదండ్రులు ఆయ‌న దృష్టికి తేవ‌డానికి ప్ర‌య‌త్నించారు. అయితే ఎమ్మెల్యే గోపిరెడ్డి ఈ విష‌యాన్ని అస్స‌లు విన‌నే విన‌లేద‌ని అంటున్నారు. ఎమ్మెల్యే తీరుతో మ‌న‌స్తాపం చెందిన కోటేశ్వ‌ర‌రావు త‌ల్లిదండ్రులు త‌మ కుమారుడు చేసిన త‌ప్పేమిట‌ని ఎమ్మెల్యేను ప్ర‌శ్నించార‌ని తెలుస్తోంది.

దీంతో తీవ్ర ఆగ్ర‌హం చెందిన గోపిరెడ్డి శ్రీనివాస‌రెడ్డి త‌న‌ను ప్ర‌శ్నించిన‌ కోటేశ్వరరావు తండ్రి ఆళ్ల సత్యనారాయణను పోలీసుల‌కు చెప్పి అరెస్టు చేయించారు. ఈ వ్య‌వ‌హారం మీడియా ద్వారా వైర‌ల్ గా మారింది. దీంతో స్థానిక జ‌న‌సేన పార్టీ నాయ‌కులు పోలీసు స్టేష‌న్ కు చేరుకున్నారు. ఆళ్ల‌ సత్యనారాయణను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అయితే పోలీసులు ఆయ‌న‌ను వ‌దిలిపెట్ట‌డానికి ఇష్ట‌ప‌డ‌లేద‌ని అంటున్నారు. ఎట్ట‌కేల‌కు ఎప్ప‌టికో ఆయ‌న‌ను విడుద‌ల చేశార‌ని చెబుతున్నారు.

దీనిపై జ‌న‌సేన పార్టీతోపాటు ఇత‌ర ప్ర‌తిప‌క్ష నేత‌లు మండిప‌డుతున్నారు. వైఎస్సార్సీపీ నేత‌లు దౌర్జ‌న్యాల‌కు పాల్ప‌డుతున్నార‌ని.. త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకోవాల‌ని ప్ర‌య‌త్నించిన‌వారిని బెదిరించ‌డం, వారిని పోలీసుల‌తో అరెస్టు చేయిస్తున్నార‌ని మండిప‌డుతున్నారు.

ఇప్ప‌టికే గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో రాష్ట్రంలో చాలా చోట్ల వైఎస్సార్సీపీ నేత‌ల‌కు ప్ర‌జ‌ల నుంచి చుక్కెదురు అవుతోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో స‌మ‌న్వ‌యంతో వ్య‌వ‌హ‌రించాల్సిన వీరు పోలీసులను అడ్డుపెట్టుకుని చేస్తున్న వ్య‌వ‌హారం వైఎస్సార్సీపీ నేత‌ల మెడ‌కే చుట్టుకుంటుంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.