Begin typing your search above and press return to search.

బాస్ కు దిమ్మతిరిగే మెసేజ్ పెట్టిన ఉద్యోగి.. లీవ్ ఇలా కూడా అడుగుతారా..?

By:  Tupaki Desk   |   31 Oct 2021 2:30 AM GMT
బాస్ కు దిమ్మతిరిగే మెసేజ్ పెట్టిన ఉద్యోగి.. లీవ్ ఇలా కూడా అడుగుతారా..?
X
సాధారణంగా ఏదైనా ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒకరోజు సెలవు కోసం నానా తంటాలు పడాల్సి వస్తుంది. సెలవు కోసం ఒక్కోసారి అబద్ధాలు చెప్పడం అనివార్యం. సిక్ అయ్యామని, ఇంట్లో వారికి ఆరోగ్యం సరిగా లేదని, పిల్లల స్కూల్ అని, బామ్మకు హెల్త్ బాగాలేదని అనేక సాకులతో సెలవు కోసం ప్రయత్నిస్తాం. ఎంతలా అంటే మనం చెప్పేవి అబద్ధాలు అని బాస్ కి తెలిసినా కూడా సెలవు ఇచ్చేంత. ఇకపోతే ఈ ప్రయత్నంలో ఒక్కోసారి బాస్ చేత చివాట్లు తినాల్సి వస్తుంది. అంతేకాకుండా లీవ్ కోసం ఉద్యోగి చెప్పే రీజన్స్ కూడా ఆ బాస్ కు దిమ్మతిరిగిపోయేలా ఉంటాయి. సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఓ బాస్ కి వచ్చింది. ఓ రోజు ఉదయం సెలవు కావాలంటూ తన ఆఫీసులో పనిచేసే ఉద్యోగి ఒకరు మెసేజ్ పెట్టారు. అయితే లీవ్ ఎందుకు కావాలో ఆ ఉద్యోగి చెప్పినా కారణంతో ఆ బాస్ ఒక్కరే కాదు... చదివిన మనం కూడా షాక్ అవుతాం. ఇంతకీ అదేంటి అంటే...

తన ఆఫీసులో పనిచేసే ఓ ఉద్యోగి సెలవు కోసం బాస్ కు మెసేజ్ పెట్టారు. 'డియర్ బాస్... ఈరోజు నేను ఆఫీస్ కు రాలేనని' మెసేజ్ స్టార్ట్ చేశారు. ఇక ఆ తర్వాత అసలు విషయం చెప్పారు. 'నా సాక్సులు చాలా మురికిగా ఉన్నయి. నా గర్ల్ ఫ్రెండ్ వాటిని వాష్ చేయలేదు. సాక్సులు లేకుండా షూస్ వేసుకోలేను. పైగా నా బూట్లకు రంధ్రాలు కూడా ఉన్నాయి. షూస్ లేకుండా ఆఫీస్ కి రాలేను. అందుకే నాకు సెలవు కావాలని' మెసేజ్ చేశారు. ఆ మెసేజ్ చదివిన బాస్ కి ఏం చేయాలో అర్థం కాలేదు పాపం. దిమ్మతిరిగిపోయిన బాస్.. అదే స్థాయిలో మెసేజ్ పెట్టారు. ప్రస్తుతం ఈ సందేశాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.


ఆ ఎంప్లాయి సెలవు కోసం పెట్టిన మెసేజ్ చూసిన ఆ బాస్... 'ఏంటి కామెడీగా ఉందా?' అని రిప్లై ఇచ్చారు. అంతేకాకుండా 'మీరు అంతగా నవ్వుతున్నారు.. ఏంటి కామెడీ చేస్తున్నారా..? షూస్ లేకపోవడం ఏంటి..? సరే ఆఫీస్ కు రా రేపు మాట్లాడుకుందాం.. ఈ ప్లేస్ లో వేరే వ్యక్తి ఉంటే రేపటి నుంచి ఆఫీసుకు రావొద్దు అనేవాడిని' అని రిప్లై ఇచ్చారు. అంతేకాకుండా ఈ మెసేజ్ లను స్క్రీన్ షాట్స్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇదీ ఉద్యోగుల తీరు అనే క్యాప్షన్ తో షేర్ చేశారు. అయితే ఈ మెసేజ్ అందరికీ కనక్ట్ అయ్యేలా ఉంది కాబట్టి వైరల్ గా మారింది.

సహజంగా లీవ్ కోసం ఓ ఉద్యోగి ఎలాంటి మాటలు చెప్తారో అందరికీ తెల్సిందే. ప్రతి ఉద్యోగి సెలవు కోసం విజ్ఞప్తి చేసేటప్పుడు ఎంతో ఆలోచిస్తాడు. అందుకే ఈ సందేశాలు నెటిజన్లకు బాగా కనెక్ట్ అయ్యాయి. ఇక చాలామంది దీనిపై కామెంట్ చేస్తున్నారు. ఈ స్క్రీన్ షాట్లను షేర్ చేస్తున్నారు. మరికొందరైతే ఏకంగా... 'సాక్సులు నేను కొనిస్తానని బాస్ రిప్లై ఇవ్వాల్సిందని' సూచిస్తున్నారు. ఇంకొందరేమే... రేపు ఆఫీసుకు వస్తే ఏం చేస్తారని అడిగారు. ఒక్కరోజు లీవ్ కోసం బాస్, ఉద్యోగి నడుమ సాగిన ఈ ఆసక్తికరమైన సంభాషణ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.