Begin typing your search above and press return to search.

గుర్తుకొస్తున్నాయి.. ఏపీ ఉద్యోగుల ఫోన్లు మార్మోగుతున్నాయి!

By:  Tupaki Desk   |   14 Dec 2022 4:05 AM GMT
గుర్తుకొస్తున్నాయి.. ఏపీ ఉద్యోగుల ఫోన్లు మార్మోగుతున్నాయి!
X
పాల‌కులు తాము ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన హామీల‌ను మ‌రిచిపోవ‌చ్చు. ఎందుకంటే ప‌ని ఒత్తిడి అలా ఉంటుంది కాబ‌ట్టి. లేదా.. వాటిని నెర‌వేర్చేమార్గాలు త‌గ్గిపోవ‌చ్చు. రెండింటిలో ఏదైనా కూడా.. హామీల అమ‌లు మాత్రం అట‌కెక్కుతుంది. కానీ, ఈ హామీల‌పై ఆశ‌లు పెట్టుకున్న ఉద్యోగులు , ఆయా వ‌ర్గాల ప్ర‌జ‌లు మాత్రం వాటిని నిరంత‌రం గుర్తు చేసుకుంటూనే ఉంటారు.

గ‌తంలో సంగ‌తి ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. ఇప్పుడు సోష‌ల్ మీడియా ఎఫెక్ట్ పెరిగిపోవ‌డం.. గ‌తంలో చేసిన వాగ్దా నాల చిట్టా.. యూట్యూబ్‌లో ఉండ‌డంతో కీల‌క‌మైన ఎన్నిక‌ల ముంగిట‌.. వారు ఆయా వీడియోల‌ను క‌ట్ చేసి.. సోష‌ల్ మీడియాలో పెట్టి మ‌రీ ప్ర‌చారం చేస్తున్నారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వ‌స్తోందంటే.. తాజాగా ఉద్యోగులు గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీ అధినేత‌గా ప్ర‌స్తుత సీఎం జ‌గ‌న్ ఇచ్చిన వాగ్దాల‌ను జోరుగా వైర‌ల్ చేస్తున్నారు.

అప్ప‌టి పాద‌యాత్ర‌లో జ‌గ‌న్‌.. ఉద్యోగుల‌కు సంబంధించి తాను నిర్వ‌హించిన అనేక స‌భ‌ల్లో కొన్ని మాట లు చెప్పారు. అప్ప‌టి టీడీపీ స‌ర్కారుపై తీవ్ర విమ‌ర్శ‌లు కూడా చేశారు. తాను అధికారంలోకి వ‌స్తే.. వాటిని నెర‌వేరుస్తాన‌ని అన్నారు. ఉద్యోగుల‌పై క‌న్నీరు కురిపించారు. కానీ, అవ‌న్నీ.. సీఎంగా జ‌గ‌న్ మ‌రిచిపోయారు. కానీ, ఉద్యోగులు మాత్రం మ‌రిచిపోలేదు. వాటిని.."గుర్తుకొస్తున్నాయి.." అంటూ.. వైర‌ల్ చేస్తున్నారు.

మ‌రి అప్ప‌ట్లో సీఎం ఏమ‌న్నారంటే.. "ఉద్యోగులు అంటే.. ల‌క్ష‌లు, కోట్ల రూపాయ‌ల ఆస్తులు ఉన్న‌వాళ్లు కాదు. ఏదో ఉద్యోగం చేసి, ఆ వ‌చ్చే కొద్దిపాటి జీతంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కానీ, ఈ ప్ర‌భుత్వం వారిని ఎప్పుడు జీతాలిస్తోం దో తెలుసా? సీఎం గారికి గుర్తుకు వ‌చ్చిన‌ప్పుడు జీతాలు ప‌డుతున్నాయి. గుర్తుకు రాక‌పోతే.. అవి కూడా ప‌డ‌డం లేదు. నెల‌ల త‌ర‌బ‌డి పెండింగులో పెడుతున్నారు. ఇక‌, డీఏల సంగ‌తిని ఈ ప్ర‌భుత్వం మ‌రిచిపోయింది. రెండేళ్లుగా డీఏ బ‌కాయిలు పెట్టింది.

ఇత‌ర అల‌వెన్సుల్లోనూ కోత పెట్టింది. దేవుడి ద‌య‌, మీ అంద‌రి ఆశీర్వాదంతో మ‌నంద‌రం ప్ర‌భుత్వం రాగానే.. అన్ని బ‌కాయిలను మొద‌టి సంవ‌త్స‌రంలోనే క్లియ‌ర్ చేస్తాన‌ని చెబుతున్నా. అంతేకాదు.. జీతాలు పెంచి.. ఖ‌చ్చితంగా 1వ తారీకుకు ముందుగానే మీ మీ అకౌంట్ల‌లో వేస్తాన‌ని హామీ ఇస్తున్నా".. కానీ, ఇప్పుడు ఇందులో ఒక్క‌టి కూడా జ‌ర‌గ‌డంలేద‌ని ఉద్యోగులు అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.