Begin typing your search above and press return to search.

ఈ ఐటీ విభాగాల్లో పని చేసేందుకు ఉద్యోగులు అస్సలు దొరకట్లేదట

By:  Tupaki Desk   |   12 Nov 2021 12:30 AM GMT
ఈ ఐటీ విభాగాల్లో పని చేసేందుకు ఉద్యోగులు అస్సలు దొరకట్లేదట
X
కరోనా వేళ తమ ఫ్యూచర్ ఎలా ఉంటుందనికంగారు పడిన ఐటీ ఉద్యోగులు ఇప్పుడు యమా హ్యాపీగా ఉన్నారు. ఇంట్లోనే ఉండి పని చేయటం(కొందరికి మాత్రం కష్టంగా ఉందనుకోండి) ఒక ఎత్తు అయితే..కరోనా తర్వాత మారిన పరిస్థితుల కారణంగా టెకీలకు పెరిగిన డిమాండ్ తో వారి పరిస్థితి మారిపోయింది. జీతం ఎంత ఇవ్వటానికైనా ఐటీ కంపెనీలు వెనుకాడటం లేదు. కాకుంటే.. ఒకే ఒక్క సమస్య ఏమంటే.. వర్కు లోడ్ హెవీగా ఉండటం.

ఈ విషయాన్ని పక్కన పెడితే.. కొన్ని విభాగాల్లో పని చేసేందుకు ఐటీ ఉద్యోగులు అస్సలు దొరకటం లేదని... ఇప్పుడున్న పరిస్థితుల్లో వీరికున్న డిమాండ్ అంతా ఇంతా కాదని చెబుతున్నారు. తాము నిర్వహించిన తాజా అధ్యయనంలో బయటకు వచ్చిన పలు అంశాల్ని ఇండీస్ వెబ్ సైట్ వెల్లడించింది. కొన్ని ఉద్యోగాలకు సంబంధించి ఉద్యోగ ప్రకటన వెలువడిన రెండు నెలలకు కూడా తమకు అవసరమైన అభ్యర్థులు దొరకటం లేని పరిస్థితిని ఐటీ కంపెనీలు ఎదుర్కొంటున్నాయని పేర్కొంది.
అంతేకాదు 2019 సెప్టెంబరు నుంచి 2021 సెప్టెంబరు మధ్య ఐటీ ఉద్యోగప్రకటనలు రెట్టింపు అయినట్లుగా వెల్లడించింది. 2020 సెప్టెంబరుతో పోలిస్తే.. 2021 సెప్టెంబరుకు ఐటీ ఉద్యోగులు కావాలెను అన్న ప్రకటనల సంఖ్య దాదాపు 9 శాతం పెరిగినట్లుగాచెప్పిన ఈ సంస్థ.. డెవలపర్ ఉద్యోగ ప్రకటనలు 7 శాతం.. సీనియర్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అప్లికేషన్ డెవలపర్ ఉద్యోగాలు 5 శాతం చొప్పున పెరిగాయి.

కొందరు ఐటీ ఉద్యోగులకు జీతభత్యాలు భారీగా పెరిగాయని.. సాఫ్ట్ వేర్ అర్కిటెక్ట్స్ కు రూ.13 లక్షల వార్షిక వేతనం ఇచ్చేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయని పేర్కొంది. ఐటీ ఉద్యోగ ఖాళీలు ఎక్కువగా ఉన్న నగరాల్లో బెంగళూరు మొదటి స్థానంలో ఉంటే.. తర్వాతి స్థానాల్లో ఫూణె.. హైదరాబాద్.. చెన్నై.. ముంబయిలో ఉన్నట్లు ఇండీడ్ పేర్కొంది. కరోనా నేపథ్యంలో టెక్నాలజీని వాడేందుకు అన్ని విభాగాలకు చెందిన సంస్థల్లో ఎక్కువైందని.. ఇదే తాజా డిమాండ్ కు కారణమని చెబుతున్నారు.

ఇక.. ఐటీ కంపెనీల్లో బాగా డిమాండ్ ఉన్న విభాగాలు.. రూ.9.7 నుంచి రూ.13 లక్షల వార్షిక జీతభత్యాల్ని ఇచ్చే ఉద్యోగాల విషయానికి వస్తే.. సాఫ్ట్ వేర్ ఆర్కిటెక్ట్.. టెక్నికల్ లీడ్.. డేటా ఇంజినీర్.. శాప్ కన్సల్టెంట్.. సేల్స్ ఫోర్స్ డెవలపర్ కు మంచి డిమాండ్ ఉందంటున్నారు.

ఇక.. ఐటీ కంపెనీలకు కొన్ని విభాగాలకు అవసరమైన ఉద్యోగులు దొరకటం చాలా కష్టంగా ఉందని చెబుతున్నారు. ఆ విభాగాలు ఏమటన్న విషయాన్ని తాజా అధ్యయనంలో గుర్తించారు. ఇండీడ్ చెప్పిన దాని ప్రకారం.. అభ్యర్థులు దొరకటం కష్టంగా ఉన్న విభాగాలు చూస్తే..

- సపోర్టు ఎక్కలేషన్ ఇంజినీర్
- బిజినెస్ అబ్జెక్టస్ డెవలపర్
- మైక్రోసాఫ్ట్ సర్వర్ ఇంజినీర్
- డీప్ లెర్నింగ్ ఇంజినీర్
- సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ ఇంటర్న్
- అప్లికేషన్ సెక్యూరిటీ ఇంజినీర్
- టెక్నాలజీ సొల్యూషన్స్ ప్రొఫెషనల్
- ప్రొగామర్ అనలిస్ట్
- టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజర్
- ప్రిన్సిపల్ ప్రొడక్ట్స్ మేనేజర్