Begin typing your search above and press return to search.
నయా దందా: మునుగోడులో గుట్టల్లా బీరు బాటిళ్లు
By: Tupaki Desk | 2 Nov 2022 1:31 PM GMTతెలంగాణలో ఉప ఎన్నికలు అంటే చాలు డబ్బుల ప్రవాహం కొనసాగుతోంది. మొన్నటి దుబ్బాక .. నిన్నటి హుజూరాబాద్, నేటి మునుగోడు వరకూ అదే కథ.. తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ఒక వైపు.. కేంద్రంలో ఉన్న అధికార బీజేపీ మరోవైపు మోహరిస్తున్న వేళ ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గంలో డబ్బు, మద్యం, బహుమతుల ప్రవాహం నెలకొంది. ఎన్నడూ లేనంతగా ఈ ప్రవాహానికి ఆ నియోజకవర్గాలు తడిసి ముద్దవుతున్నాయి.
మునుగోడులో ప్రచారం ముగిసి ఇప్పుడు పంపిణీ కొనసాగుతోంది. నిన్న సాయంత్రం ప్రచారం ముగియడంతో ఇక డబ్బుల పంపిణీ మొదలైంది. డబ్బుల పంపిణీ రాత్రంతా కొనసాగింది. ప్రధాన రాజకీయ పార్టీల నేతలంతా ఇదే మందు, విందులు, డబ్బులు, గిఫ్ట్ ల పంపిణీలో మునిగిపోయారు.ఒక పార్టీ తాజాగా మునుగోడులో ఓటుకు రూ.3వేలు, క్వార్టర్ మద్యం పంపిణీ చేసినట్టు తెలిసింది. ఇక మరో పార్టీ ఓటుకు రూ.4వేలు చొప్పున ఇచ్చినట్టు పలు గ్రామాల్లో టాక్ నడుస్తోంది. మొదట రూ.3వేలు పంచిన ఒక పార్టీ మళ్లీ ఈఱోజు రెండో దఫా కూడా ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.
ప్రధానంగా మునుగోడులో రెండు పార్టీల నుంచి డబ్బులు అందాయని ప్రజలు ఆఫ్ ది రికార్డ్ గా చెబుతున్నారు. ఓట్ల కోసం కోట్ల రూపాయలు రాత్రికి రాత్రి పంచుతున్నారని ప్రచారం సాగుతోంది. డబ్బు, మద్యం పంపిణీ యథేచ్ఛగా విచ్చలవిడిగా పంచుతున్నారని తెలుస్తోంది.సోమవారం రాత్రి నుంచి పంపకాలు మొదలుపెట్టిన ఒక పార్టీ మంగళవారం పొద్దుపోయే వరకూ దాదాపు పంపిణీ లక్ష్యం పూర్తి చేశారట.. ప్రత్యర్థి పార్టీల పంపకాలు చేయకుండా కట్టడి చేస్తూ వ్యూహాలు పన్నుతున్నారట.. తమ ఓటర్ల వద్దకు మిగతా ప్రత్యర్థి ప్రత్యర్థులు రాకుండా శ్రేణులతో కలిసి గ్రామాల్లో తిష్ట వేస్తున్నట్టు సమాచారం.
బైపోల్ సందర్భంగా ఢిల్లీ నుంచి తెలంగాణ గల్లీల దాకా ఉన్న టీఆర్ఎస్, బీజేపీ నేతలందరూ మునుగోడులో వాలిపోయారు. ఇప్పుడు వారంతా మునుగోడు వదిలి వెళ్లిపోయారు. అయితే నియోజకవర్గ పరిధిలో గత నెలరోజులుగా ఎన్నడూ లేనంతగా మద్యం ఏరులైపారింది.
నియోజకవర్గంలో కాళీ అయిన బీర్లు, మద్యం బాటిళ్లు గుట్టలుగా పేరుకుపోయాయని.. ఈ దందా కూడా రికార్డు స్థాయిలో జరుగుతోందంటూ నెటిజన్లు మునుగోడులో ఖాళీ అయిన బీర్ బాటిల్స్ ను పోస్ట్ చేస్తూ హోరెత్తిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.