Begin typing your search above and press return to search.

ఆ ఎమ్మెల్యేతో రాజీ ప‌డు..లేదంటే ఎన్‌ కౌంట‌ర్

By:  Tupaki Desk   |   16 April 2018 5:17 AM GMT
ఆ ఎమ్మెల్యేతో రాజీ ప‌డు..లేదంటే ఎన్‌ కౌంట‌ర్
X
అధికార పార్టీ ఎమ్మెల్యేతో డీల్ కుదుర్చుకొని స‌మ‌స్య ఏదైనా ఉంటే ప‌రిష్క‌రించుకోవాల‌ని లేదంటే ఎన్‌కౌంట‌ర్ చేసేస్తానంటూ ఓ పోలీసు అధికారి జ‌రిపిన బెదిరింపుల ఆడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. సోష‌ల్ మీడియాలో త‌ర‌చూ వార్త‌ల్లో నిలిచే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకోవాలంటే బీజేపీ నేతల్ని కలిసి డీల్‌ కుదుర్చుకోవాలని ఓ పోలీసు అధికారి నేరస్థుడితో ఫోన్‌ లో సంభాషించాడు. ఈ వ్యవహారానికి సంబంధించిన ఆడియో క్లిప్‌ బయటికి రావడంతో ఆ అధికారిపై సస్పెన్షన్‌ వేటు పడింది.ఉత్తరప్రదేశ్‌ లోని ఝాన్సీ జిల్లాలో చోటుచేసుకుంది.

70 కేసుల్లో నిందితుడిగా ఉన్న మాజీ ప్రజాప్రతినిధి లేఖరాజ్‌ సింగ్‌ యాదవ్‌ కు మయూరాణీపూర్ పోలీస్‌ స్టేషన్ ఎస్‌ హెచ్‌ వో సునీల్‌ కుమార్‌ సింగ్ ఫోన్‌ చేసి బీజేపీ నాయకులతో ఒప్పందం కుదుర్చుకోవాలని లేదా ఎన్‌ కౌంటర్ చేస్తానని బెదిరింపులకు దిగాడు. `ఎన్‌ కౌంటర్ల సీజన్ ప్రారంభమైంది. నీ మొబైల్ నంబర్ నిఘా దృష్టిలో ఉంది. నిన్ను త్వరలోనే చంపేస్తాం. బీజేపీ జిల్లా అధ్యక్షుడు, స్థానిక బీజేపీ ఎమ్మెల్యేతో మాట్లాడి బేరం కుదుర్చుకో. లేదా ఏమైనా జరుగొచ్చు` అని సునీల్‌ కుమార్‌ సింగ్ హెచ్చరించాడు. ఫోన్ సంభాషణ తర్వాత సింగ్ పోలీసు బృందం యాదవ్‌ ను అరెస్ట్ చేసేందుకు అతని గ్రామానికి వెళ్లింది. పోలీసులపై కాల్పులు జరిపి అక్కడి నుంచి తప్పించుకున్న యాదవ్.. సునీల్‌ కుమార్‌ సింగ్ మాట్లాడిన ఆడియోను మీడియాకు అందజేశాడు. సామాజిక మాధ్యమాల్లో ఈ ఆడియో వైరల్ కావడంతో పోలీసు ఉన్నతాధికారులు సింగ్‌ ను సస్పెండ్ చేశారు.