Begin typing your search above and press return to search.

అమెరికా పోలీసులు ఎన్ కౌంటర్ హీరోలా !

By:  Tupaki Desk   |   6 Nov 2015 10:30 PM GMT
అమెరికా పోలీసులు ఎన్ కౌంటర్ హీరోలా !
X
ప్ర‌పంచ పెద్ద‌న్న అమెరికా క్ర‌మ‌క్ర‌మంగా పోలీస్ రాజ్యంగా మారిపోతోంది. శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ‌, దేశంలో అవాం​ఛనీయ ఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డ‌టం, దోపిడీలు అనే కార‌ణాల‌తో ప‌లువురిని అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే గడచిన పది మాసాల్లోనే వివిధ కార‌ణాల వ‌ల్ల‌ పోలీసుల కర్కశ్తత్వానికి వెయ్యి మందికి పైగా అమాయకులు బలయ్యారు. దీన్ని బ‌ట్టే అమెరికాలో పోలీసుల అధికార జులుం స్థితిని అర్థం చేసుకోవ‌చ్చు. ఈ ప‌రిణామాల‌పై ఆ దేశంలోని సామాజిక వేత్తలు స్పందిస్తూ అమెరికాలో రాజ్యహింస నానాటికీ పెరుగుతోందనడానికి ఇదొక సంకేతమని గ‌గ్గోలు పెడుతున్నారు.

ఈ ఏడాది మొదటి నుంచి తాజా గ‌ణాంకాలు వెలువ‌డే వరకు అమెరికా పోలీసుల చేతిలో హ‌తులైన వారి సంఖ్య 1,006కు చేరుకుంది. స్థానిక వార్తాపత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా పోలీసుల చేతిలో చనిపోయిన వారి సంఖ్యకు సంబంధించిన అధికారిక వివరాలనే కిల్డ్‌ బై పోలీస్‌.నెట్ అనే వెబ్ సైట్ ప్ర‌క‌టించింది. అనధికారిక గణాంకాల ప్రకారం ఈ మృతుల సంఖ్య దీనికి రెట్టింపు వుంటుందని భావిస్తున్నారు. గణాంకాల ప్రకారం గత ఏడాది పోలీసుల చేతిలో చనిపోయినవారి సంఖ్య 1,108గా నమోదైంది. ప్రస్తుతం నెలకు 98 మంది చొప్పున చనిపోతుండడంతో ఈ ఏడాది ఆ సంఖ్య 1200కు చేరవచ్చున‌ని వారు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ప్ర‌పంచానికి పాఠాలు చెప్పాల్సిన అమెరికా ఈ ప‌రిణామం ఎంత మాత్రం అభిలాషించ‌ద‌గిన‌ది కాద‌ని విశ్లేష‌కులు చెప్తున్నారు.