Begin typing your search above and press return to search.

ఎయిర్‌ బ‌స్ ఆ విమానాలు త‌యారు చేయ‌ద‌ట‌!

By:  Tupaki Desk   |   15 Feb 2019 5:39 AM GMT
ఎయిర్‌ బ‌స్ ఆ విమానాలు త‌యారు చేయ‌ద‌ట‌!
X
ఏ380...ఎయిర్‌ బస్ సూపర్‌ జంబో విమానం ఇది. ఏ380 ఓ డబుల్-డెక్కర్ ప్లేన్. రెండంతస్తుల విమానం అన్నమాట. సాధారణ విమానాలతో పోల్చితే ఇది ఎంతో విశాలంగా ఉంటుంది. ప్రస్తుత ప్యాసింజర్ ఎయిర్‌ లైన్స్‌ల్లో ఇదే అత్యంత పెద్దది. 500ల నుంచి 850 మందిదాకా ప్రయాణీకులు దీనిలో ప్రయాణించవచ్చు. సూపర్‌జంబో విమానాల తయారీని ఆపేయనున్నట్లు ప్రకటించింది ఎయిర్‌ బస్. విమానయానాన్ని మరింత సుందరంగా, విలాసవంతంగా మార్చిన ఈ ప్రపంచపు అతిపెద్ద ఎయిర్‌ లైనర్‌ కు ఇప్పుడు డిమాండ్ తగ్గిపోవడంతో ఎయిర్‌ బస్ ఈ సంచలన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. 2021లో చివరి ఏ380 విమానం డెలివరీ ఉంటుందని గురువారం ఐరోపా ఏరోస్పేస్ దిగ్గజమైన ఎయిర్‌బస్ తెలియజేసింది.

బోయింగ్ 747 విమానాలకు ఏ380ను ఎయిర్‌ బస్ పోటీగా తెచ్చింది. గతేడాది 10 విమానాలను తయారు చేసిన ఎయిర్‌ బస్.. ఈ ఏడాది మరో ఎనిమిది, వచ్చే ఏడాది ఇంకో ఏడింటిని తయారు చేయనున్నట్లు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. 2021లో రెండు విమానాలను తయారు చేస్తామన్న ఎయిర్‌బస్.. అదే ఏ380 విమానాల ఉత్పత్తికి ఆఖరు సంవత్సరమని స్పష్టం చేసింది. ఈ మూడేండ్లలో తయారయ్యే 17 ఏ380 విమానాల్లో 14 ఎమిరేట్స్‌ కు - మరో మూడు జపాన్‌ కు చెందిన ఏఎన్ ఏ ఎయిర్‌ లైన్‌ కు అందించనున్నట్లు వెల్లడించింది. ఏ380 విమాన సేవలు మొదలైన పుష్కర కాలం (పన్నెండేండ్లు)లోనే వాటి తయారీ నిలిచిపోతుండటంపట్ల విమానయాన పరిశ్రమ నిపుణులు - విశ్లేషకులు ఒకింత ఆందోళననే వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో విమాన ప్రయాణీకుల రద్దీ గణనీయంగా పెరుగవచ్చన్న అంచనాల నడుమ ఏ380 విమానాల సంఖ్య పరిమితంగా ఉంటే.. లక్షలాది ప్రయాణీకుల రవాణా పరిస్థితి ఏంటని? ప్రశ్నిస్తున్నారు. నిజానికి తరచూ ఏ380 విమానాలపై ఎయిర్‌ బస్ గొప్ప రాయితీలనే ప్రకటిస్తూంటుంది. అయినప్పటికీ ఎవరూ ఆసక్తి కనబరుచడం లేదు. ఉత్పాదక వ్యయం కూడా పెరుగడం ఎయిర్‌బస్ తాజా నిర్ణయానికి కారణమైంది.

అయితే, ఎయిర్‌ బస్ ప్రతిష్ఠాత్మక ఉత్పత్తి ఏ380 నిలిపివేతకు ఎమిరేట్స్ నిర్ణయమే ప్రధాన కారణం. ఏ380 విమానాల కోసం ఎయిర్‌ బస్‌ కున్న ప్రధాన కస్టమర్ దుబాయ్‌ కి చెందిన ఎమిరేట్సే. 123 ఏ380 విమానాల ఆర్డర్లను ఎయిర్‌ బస్‌ కు ఎమిరేట్స్ ఇచ్చింది. ఇందులో ఇప్పటిదాకా 109 విమానాలను ఎమిరేట్స్‌ కు ఎయిర్‌ బస్ అందించింది కూడా. మరో 14 విమానాలను ఇవ్వాల్సి ఉన్నది. అయితే గ్లోబల్ విమానయాన మార్కెట్‌ లో మారిన పరిస్థితులు - వ్యయ నియంత్రణ దృష్ట్యా ఏ380 కొత్త ఆర్డర్లను తగ్గించుకున్న ఎమిరేట్స్.. ఏ320 - ఏ350 విమానాల కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తున్నది. ఈ క్రమంలోనే 70 ఏ320 - ఏ350 విమానాల ఆర్డర్లనూ ఇచ్చింది. దీంతో ఇక ఏ380 తయారీకి గుడ్‌ బై చెప్పడమే మంచిదన్న భావనకు ఎయిర్‌ బస్ రావాల్సి వచ్చింది. ఎమిరేట్స్ కాకుండా ఎయిర్‌బస్‌కు ఏ380 ఆర్డర్లనిచ్చే సంస్థలు ప్రస్తుతం లేవు. 2021 తర్వాత ఉత్పత్తికి అవకాశాలు కనిపించడం లే దు. అని ఎయిర్‌ బస్ కా బోయే సీఈవో ఫౌర్ వెల్ల‌డించారు

ఇదిలాఉండ‌గా, ప‌రిశ్ర‌మ‌లో వ‌చ్చిన మార్పు సైతం ఈ నిర్ణ‌యానికి కార‌ణ‌మ‌ని అంటున్నారు. సుదూర ప్రాంతాలకు తిరిగే భారీ విమానాల కంటే తక్కువ దూరం కలిగిన చాలా ప్రాంతాలకు వెళ్లే మధ్య, చిన్న శ్రేణి విమానాలే నయమన్న భావన పరిశ్రమలో కనిపిస్తోంది. ఈ తరహా విమానయాన సేవలే లా భదాయకం అన్న ధోరణి ప్రస్తుత విమానయాన రంగంలో కనిపిస్తున్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే ఏ380కు పెట్టే డబ్బుతో చిన్నవి మానాలను పెద్ద ఎత్తున కొనవచ్చని, ఎక్కువ మార్గాల్లో తిప్పవచ్చన్న ఆలోచనలున్న సం స్థలు పరిశ్రమలో పెరిగిపోతున్నాయని చెబుతున్నారు. ఎయిర్‌ బస్ సైతం ఇకపై ఏ320 ఇతరత్రా విమానాల తయారీపై దృష్టి పెడుతామని ప్రకటించడం ఇందుకు నిదర్శనం.