Begin typing your search above and press return to search.

వర్క్ ఫ్రం హోకు శుభకార్డు యేనా?

By:  Tupaki Desk   |   18 July 2021 2:30 PM GMT
వర్క్ ఫ్రం హోకు శుభకార్డు యేనా?
X
దాదాపు ఏడాదిన్నరగా ఐటీ సహా వివిధ కంపెనీలన్నీ తమ ఉద్యోగులను కరోనా కారణంగా ఇంటినుంచే పనిచేయిస్తున్నాయి. సామూహికంగా సోకే ఈ అంటు వ్యాధి వల్ల ఎవరూ గ్రూపులుగా పనిచేయడానికి వీల్లేదు. ఈ క్రమంలోనే ఇంట్లో పెళ్లాం పిల్లల లొల్లితో.. అటు టైమింగ్ లేకుండా పొద్దున్నుంచి రాత్రి వరకు ఉద్యోగులు అష్టకష్టాలు పడుతున్నారు.

ఈ క్రమంలోనే కరోనా తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడు ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోంకు స్వస్తి పలకాలని డిసైడ్ అవుతున్నాయి. ఇళ్ల నుంచి ఉద్యోగులను ఆఫీసులకు రప్పించి ఇక్కడి నుంచి పనిచేయించాలని డిసైడ్ అవుతున్నాయట..

ఏడాదిన్నరగా ఉద్యోగులు ఇంట్లోనుంచే ‘వర్క్ ఫ్రం హోం’ చేస్తుండడంతో కంపెనీలకు రూపాయి ఖర్చు లేదని.. నిర్వహణ బాధ తప్పిందని.. కంపెనీలు మూసి ఉండడంతో బోలెడు డబ్బు, వ్యయం తగ్గిందని చెబుతున్నాయి.

ఇక ఉద్యోగులది మరో వ్యథ. సంవత్సరన్నర నుంచి.. కరోనా లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి వర్క్ ఫ్రం హోం అంటూ పగలూ రాత్రి తేడా లేకుండా.. ఓ సమయం పాడూ లేకుండా పనిచేస్తున్నారు. ఇక ఇంట్లో భార్యా, పిల్లల హోరుతో పనిపై కాన్సట్రేట్ చేయలేని పరిస్థితి. అందుకే వర్క్ ఫ్రం హోం అంటేనే ఉద్యోగులు హడలిచస్తున్నారు. తాము వెంటనే ఆఫీసులకు వస్తామని.. టైం ప్రకారం చేసి సేదతీరుతామంటున్నారు.

ఐటీ ఉద్యోగులకు , వారి కుటుంబాలకు టీకాలు వేయించి ఆఫీసులు తెరవాలని ఆయా కంపెనీలు ప్లాన్ చేస్తున్నాయి. త్వరలోనే ఐటీ కంపెనీలన్నీ తమ ఉద్యోగులకు పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ చేయించి ఆఫీసుల నుంచే పనిచేయించాలని భావిస్తున్నాయి.

గత ఏడాది మార్చి నుంచి టీసీఎస్ సహా విప్రో, ఇన్ఫోసిస్ సహా ఐటీ కంపెనీలు అన్నీ తమ ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఇచ్చాయి. సెప్టెంబర్ వరకు అందరు ఉద్యోగులను ఆఫీసులకు రప్పించడానికి ప్లాన్ చేస్తున్నాయి.

ఐటీ ఉద్యోగులు ఆర్థిక వ్యవస్థలో ప్రధాన భాగం. వర్క్ ఫ్రం హోంతో కంపెనీలకు చాలా నిర్వహణ ఖర్చు తగ్గుతుండడంతో అప్పుడిప్పుడే అవన్నీ కంపెనీలు ఓపెన్ చేయడానికి ఉత్సాహంగా లేవు. తిరిగి కార్యాలయాలు తెరవానికి తటపటాయిస్తున్నాయి.

అయితే ఆర్థిక వ్యవస్థ గాడిన పడాలంటే వీలైనంత త్వరగా వాటిని తిరిగి తెరవాలని చూస్తున్నారు. చూపుతోంది. అవసరమైతే ఉద్యోగులు, వారి కుటుంబాలకు 100శాతం టీకాలు వేయడానికి కంపెనీల నుంచి సాయం అందిస్తామని ప్రకటించారు.

కాగా ఇప్పటికే చాలా ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు టీకాలు వేయడం ప్రారంభించాయి. కానీ థర్డ్ వేవ్ వస్తుందన్న నివేదికలతో మళ్లీ ఇప్పుడు కార్యాలయాలు తెరిచే అవకాశాలు కనిపించడం లేదు. అందుకే వర్క్ ఫ్రం హోంను ఈ ఏడాది చివరి వరకు కొనసాగించాలని యోచిస్తున్నాయి.

మొదటి వేవ్ తర్వాత కూడా ఇదే విధంగా కంపెనీలపై ఒత్తిడి తెచ్చారు.కానీ సెకండ్ వేవ్ రావడంతో వర్క్ ఫ్రం హోంనే కంటిన్యూ చేశారు. అందుకే ఇప్పుడు కంపెనీలు తొందరపడి ఆఫీసులు తెరిచే యోచన చేయడం లేదు. ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ కంపెనీలు థర్డ్ వేవ్ ను చూసే ఆఫీసులు తెరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.