Begin typing your search above and press return to search.
పేడతో ఆట .. ఆ ఊర్లో వింత ఆచారం !
By: Tupaki Desk | 8 Nov 2021 11:30 AM GMTఒక్కో ప్రాంతం లో ఒక్కో రకమైన ఆచారాలు , అలవాట్లు ఉంటాయి. ప్రాంతాలలో పండుగల సందర్భంగా కొన్ని వింతైన ఆచారాలు ఉంటాయి. వాటి వెనుక ఎంతో కొంత ప్రయోజనాల దృష్ట్య కూడా మన పూర్వీకులు ఇలాంటి వాటిని మన దైనందిన జీవితంలో భాగం చేస్తారని చెప్పక తప్పదు. అదేవిధంగా కర్ణాటక-తమిళనాడు సరిహద్దులో ఉన్న గుమటాపుర గ్రామంలో దీపావళి పండుగ ముగింపు సందర్భంగా ఒక వింతైన ఆచారం ఉంది.
అంతేకాదు వారు మొదట ఆలయానికి వెళ్లి గుడిలోని పూజారితో ఆశీర్వాదం తీసుకునేముందు స్థానిక చుట్టుపక్కల గ్రామాలలోని ఇళ్లలో నుంచి పెద్ద ఎత్తున ఆవుపేడను ట్రాక్టర్ల సాయంతో దేవలయానికి తరలిస్తారు. ఆ తర్వాత అబ్బాయిలంతా జరగబోయే కార్యక్రమానికి కావల్సిన బాణసంచా వంటి మందు గుండు సామాగ్రిని సిద్ధం చేసుకుంటారు. ఈ మేరకు చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా మగవాళ్లంతా ఒకరి నొకరు ఆవుపేడతో కొట్టుకుంటారు.
ప్రతి ఏడాది ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి సుదూర నగరాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున గుమటాపురానికి తరలి వస్తుంటారు. అంతేకాదు ఈ వేడుక చిన్న పాటి యుద్ధ వాతావరణాన్ని తలపించేలా సరదా సరదాగా సాగుతుంటుంది. పైగా ఆ గ్రామంలోని ప్రజలు ఇది ఆరోగ్య ప్రయోజని నిమిత్తం ఇలా చేస్తుంటామని చెబుతుండం విశేషం. ఈ మేరకు ఆ గ్రామంలోని రైతు ఈ ఆవు పేడతో ఇలా కొట్టించుకుంటే ఏదైనా వ్యాధి ఉన్న అది త్వరగా తగ్గిపోతుందని చెబుతున్నారు. పోటీలో పాల్గొనేటోళ్లే ఊర్లోని ఇల్లిల్లు తిరిగి ఆవు పెండను గుడి వద్దకు తెస్తరు. పూజ చేశాక గ్రౌండులో వేస్తరు. ఈ పోటీ వల్ల రోగాలు తగ్గుతాయని ఊరి వాళ్లు నమ్ముతరు. గత ఏడాది కరోనా టైమ్‌లోనూ ఈ పోటీకి ఆఫీసర్లు అనుమతిచ్చినా.. వైరస్ భయంతో కొంతమందే ఆట ఆడారు.