Begin typing your search above and press return to search.
వివేకా హత్య కేసు: ముగిసిన ఉమాశంకర్ రెడ్డి సీబీఐ కస్టడీ ..కోర్టులో హాజరు
By: Tupaki Desk | 20 Sep 2021 10:39 AM GMTమాజీ మంత్రి , ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ కి స్వయానా బాబాయ్ అయిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఉమాశంకర్ రెడ్డి నాలుగు రోజుల సీబీఐ కస్టడీ ముగిసింది. పులివెందుల కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ అధికారులు నిందితుడిని కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి విచారణ చేశారు. వివేకా హత్యకు సంబంధించి అతడి నుంచి కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ముమ్మర విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు అనుమానితులను విచారించి, సిబిఐ ఇంకా పలువురిని విచారించాలని అనుకుంటుంది.
కస్టడీ అనంతరం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల లోపు ఉమాశంకర్ రెడ్డి ని కోర్టులో హాజరు పరచాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.దీనితో సీబీఐ అధికారులు అతడిని కడప నుంచి పులివెందుల తీసుకెళ్లి కోర్టులో హాజరు పరిచారు. వివేకా హత్యలో సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి ప్రమేయం ఉందని సీబీఐ ఇది వరకే కోర్టుకు విన్నవించింది. ఉమాశంకర్ రెడ్డి వాడిన ఆయుధాల కోసం, మరి కొందరు నిందితుల పాత్ర తెలుసువకోవడానికి అతడిని కస్టడీలోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ కేసులో కీలక నిందితుడైన గంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేసి, కస్టడీకి ఇవ్వాలని సీబీఐ అధికారులు పులివెందుల కోర్టును గతావారం కోరారు. ఈ కేసులో సీబీఐ అధికారులు 105వ రోజు విచారణ కొనసాగిస్తున్నారు.
వివేక ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి బైయిల్ రద్దు చేయాలని పులివెందుల కోర్టులో సీబీఐ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. తొలుత ఎర్ర గంగిరెడ్డిని బుధవారం సీబీఐ అధికారులు విచారించారు. గతం లోనూ సిట్ అధికారులు అతడి అరెస్టు చేసి రిమాండుకు తరలించడంతో బెయిల్ పై బయటకొచ్చారు. విచారణ అనంతరం సీబీఐ అధికారులు ఎర్రగంగిరెడ్డికి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో కొవిడ్, వైద్య పరీక్షలు చేయించారు. ఇక, ఈ కేసులో ఇప్పటికే అరెస్టయి రిమాండులో ఉన్న సునీల్ యాదవ్ కు రక్త పరీక్షలు చేయించేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఇటీవల సీబీఐ అధికారులు వేసిన పిటిషన్ ను పులివెందుల కోర్టు బుధవారం తోసిపుచ్చింది. ఈ నెల 29వ తేదీ వరకు రిమాండును పొడిగించింది. తమ కుమారుడిని చూసేందుకు అనుమతి ఇవ్వాలంటూ కుటుంబ సభ్యులు ఈ నెల 6న కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో అతడి తల్లిదండ్రులు కృష్ణయ్య, సావిత్రికి కోర్టు అనుమతి ఇచ్చింది. గతవారం కడప సెంట్రల్ జైలు అతిథి గృహంలో చేపట్టిన విచారణకు ఉమాశంకర్ రెడ్డితో పాటు భరత్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. భరత్ పులివెందులకు చెందిన సునీల్ కుమార్ యాదవ్ బంధువు. భరత్ కుమార్, ఉమాశంకర్ రెడ్డిని ఇప్పటికే పలుమార్లు సీబీఐ అధికారులు విచారించారు. ఈ కేసులో పలువురు అనుమానితులతో పాటు వివేకానందరెడ్డి సోదరులను కూడ విచారించింది.