Begin typing your search above and press return to search.

ముగిసిన అయోధ్య వివాదం .. టార్గెట్ శబరిమల

By:  Tupaki Desk   |   11 Nov 2019 10:07 AM GMT
ముగిసిన అయోధ్య వివాదం .. టార్గెట్ శబరిమల
X
దేశం లో అత్యంత సున్నితమైన సమస్య గా భావించే అయోధ్య లోని వివాదాస్పదమైన స్థలంపై సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఆ వివాదం లో ఉన్న స్థలం హిందువుల దే అంటూ సుప్రీం తీర్పు ఇచ్చి ..ముస్లింల కోసం అయోధ్య లో మరో ఐదు ఎకరాల భూమిని ఇవ్వాల్సింది గా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ తీర్పు విషయం లో దేశం లో ఏమైనా అల్లర్లు జరుగ కుండా కేంద్రం కట్టు దిట్టమైన భద్రత ని ఏర్పాటు చేసింది. ఈ సంచలనమైన తీర్పు ని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ వెల్లడించారు. ఐదుగురి సభ్యుల ధర్మాసనం ఈ కేసు పై విచారణ చేసి తుది తీర్పుని నవంబర్ 9 న వెల్లడించింది.

ఇక పోతే సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ఈ నెల 17 న రిటైర్ కానున్నారు. ఈలోగా అతి ముఖ్యమైన నాలుగు కేసుల పై ఆయన తీర్పు ఇవ్వబోతున్నారు. అయోధ్య కేసు లో చరిత్రాత్మక మైన తీర్పును కోర్టు ఈ నెల 9 న వెలువరించిన సంగతి తెలిసిందే. ఇక మిగిలిన నాలుగు కేసులు.. శబరిమల లో అన్ని వయస్సుల మహిళల ప్రవేశానికి సంబంధించిన కేసు..అలాగే రాఫెల్ విమానాల డీల్ కు సంబంధించినది.. ఇంకొకటి , తమను ఉరి తీస్తారేమోన్న భయం తో మ్యాన్మార్ ను వదిలి వఛ్చిన సుమారు 40 వేల మంది రోహింగ్యాల పరిస్థితిపై నిర్ణయం..తో బాటు చీఫ్ జస్టిస్ పై కుట్రకు సంబంధించిన కేసును కూడా జస్టిస్ గొగోయ్ ఆధ్వర్యాన గల ధర్మాసనం పరిష్కరించాల్సిన అవసరం ఉంది.

గతం లో ఎన్నికల ప్రచారం సందర్భం గా ప్రధాని మోదీని ఉద్దేశించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 'చౌకీదార్ చోర్ హై ' అంటూ చేసిన ఆరోపణ తాలూకు కోర్టు ధిక్కరణ కేసు కూడా నమోదైన సంగతి తెలిసిందే. అయితే ఆ తరువాత రాహుల్.. తన వ్యాఖ్యకు బేషరతుగా క్షమాపణ చెప్పారు ఈ నెల 13… 15 తేదీల మధ్య జస్టిస్ గొగోయ్.. ఈ నాలుగు కేసులమీద తీర్పు చెప్పనున్నారు. ముఖ్యంగా కేరళలోని శబరిమల ఆలయంలో అన్ని వయసుల మహిళల ప్రవేశానికి సంబంధించి అనుమతి ని సవాలు చేస్తూ పలు రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఇవి పెండింగులో ఉన్నాయి. 2018 సెప్టెంబరు లో సుప్రీం కోర్టు ధర్మాసనం ఇఛ్చిన తీర్పు మీద ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. మరి..అతి సున్నితమైన అంశాల తో కూడిన ఈ కేసుల పై ప్రధాన న్యాయ మూర్తి ఎలా తీర్పునిస్తారో వేచి చూడాల్సి ఉంది.