Begin typing your search above and press return to search.

అస్ట్రేలియా చట్టాన్ని ఇక్కడా అమలు చేయండి.. పార్లమెంట్లో బీజేపీ ఎంపీ..!

By:  Tupaki Desk   |   18 March 2021 11:30 AM GMT
అస్ట్రేలియా చట్టాన్ని ఇక్కడా అమలు చేయండి.. పార్లమెంట్లో  బీజేపీ ఎంపీ..!
X
ఆస్ట్రేలియా ఇటీవల చేసిన ఓ చట్టాన్ని మనదేశంలో కూడా అమలు చేయాలని బీజేపీ ఎంపీ సుశీల్​ మోదీ కేంద్రప్రభుత్వాన్ని కోరారు. తద్వారా మీడియా సంస్థలను సంక్షోభం నుంచి గట్టేక్కించాలని ఆయన విన్నవించారు. ఇంతకీ ఆస్ట్రేలియా ఇటీవల తీసుకొచ్చిన చట్టంలో ఏముంది? తద్వారా మీడియా సంస్థలకు లాభం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. సంప్రదాయ మీడియా అందజేసే న్యూస్​ కంటెంట్​ కు ఫేస్​బుక్​, గూగుల్​, యూట్యూబ్​ వంటి టెక్ దిగ్గజాలు ఆదాయంలో వాటా చెల్లించే విధంగా ఇటీవల ఆస్ట్రేలియా ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని భారత్​ లో కూడా అమలు చేయాలని బీజేపీ ఎంపీ సుశీల్​ కోరారు. ఆయన పార్లమెంట్​ లో ఇంకా ఏమన్నారంటే..

అన్ని మీడియా సంస్థలకు ప్రధాన ఆదాయవనరు ప్రకటనలే. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సోషల్​మీడియా హవా నడుస్తోంది. దీంతో ప్రధాన మీడియా సంస్థల ఆదాయానికి సోషల్​మీడియా గండి కొడుతోంది.ప్రజలకు విశ్వసనీయ వార్తలు అందించేందుకు మీడియా సంస్థలు ఎంతో ఖర్చు పెడుతున్నాయి. కానీ వాళ్లకు ప్రకటనల ద్వారా రావాల్సిన ఆదాయాన్ని వాటాలో భారీ మొత్తాన్ని ఈ టెక్ జెయింట్లు తీసుకుంటున్నాయని తెలిపారు. దీంతో మీడియా సంస్థలు తీవ్రంగా నష్టపోతున్నాయి.

మరోవైపు సంప్రదాయ వార్తా సంస్థలైన ప్రింట్ మీడియా, న్యూస్ ఛానల్స్, న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఇటీవలి కాలంలో దయనీయమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. కాబట్టి ప్రభుత్వం ఆస్ట్రేలియా తరహా చట్టాన్ని మనదేశంలోనూ తీసుకురావాలి’ అని ఆయన పేర్కొన్నారు. పెరిగిన న్యూస్ ప్రింట్ ధరలతో కూడా ప్రధాన మీడియా తీవ్ర నష్టాల పాలయింది. ఆస్ట్రేలియాలో మాదిరిగా మన దేశంలో కూడా ఫేస్ బుక్, యూట్యూబ్, గూగుల్ వంటి సంస్థల నుంచి ఆదాయంలో వాటా చెల్లిస్తే ప్రింట్ మీడియా కూడా నష్టాల బాట నుంచి బయటపడే అవకాశం ఉందని అంటున్నారు.