Begin typing your search above and press return to search.
ఈఎస్ఐ కుంభకోణం : రూ. 144 కోట్ల ఆస్తుల జప్తు చేసిన ఈడీ !
By: Tupaki Desk | 24 Nov 2021 11:30 AM GMTఈఎస్ ఐ కుంభకోణం లో ఎన్ ఫోర్స్ మెట్ డైరక్టరేట్ రూ. 144 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. ఇందులో 133 వివిధ రకాల ఆస్తులు ఉన్నాయి. ఫ్లాట్లు, కమర్షియల్ ప్రాపర్టీ తో పాటు ఈఎస్ ఐ డైరక్టర్ గా వ్యవహరించి మొత్తం స్కాంకు సూత్రధారిగా ఉన్న దేవికారాణికి చెందిన రూ. ఆరు కోట్ల 26లక్షల విలువైన నగలు కూడా జప్తు చేసిన దాంట్లో ఉన్నాయి. ఏసీబీ నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేసింది. పెద్ద ఎత్తున మనీలాంరింగ్ జరిగినట్లుగా గుర్తించి, ఆస్తులను సీజ్ చేసింది.
మాజీ ఇన్సూరెన్స్ మెడికల్ డైరెక్టర్ దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ పద్మ, అసిస్టెంట్ డైరెక్టర్ వసంత, ఆమ్నీ మెడికల్ ఎండీ శ్రీధర్, నాగరాజు, తేజ్ ఫార్మాకు చెందిన సుధాకర్ రెడ్డి ఆస్తులను జప్తు చేసినట్లుగా తెలుస్తోంది. ఈఎస్ ఐ లోని ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ విభాగంలో మందుల కొనుగోళ్లలో నిబంధనలు తుంగలో తొక్కారని, భారీగా అక్రమాలు జరిగాయని, కోట్లాది రూపాయలు పక్కదారి పట్టాయని ఆరోపణలు వచ్చాయి.
ఐఎమ్ ఎస్ ఉద్యోగులు, మెడికల్ ఏజెన్సీలు టెండర్లు లేకుండా నకిలీ బిల్లులతో కోట్లాది రూపాయలు కాజేసినట్లుగా ఫిర్యాదులు వెల్లువెతాయి. దీంతో ఈ వ్యవహారంపై విచారణ జరిపి నిజానిజాలను తేల్చాని ఈఎస్ ఐ ముఖ్యకార్యదర్శి శశాంక్ గోయల్ ఏసీబీకి లేఖ మేరకు ఏసీబీ విచారణ నిర్వహించింది.
మాజీ ఇన్సూరెన్స్ మెడికల్ డైరెక్టర్ దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ పద్మ, అసిస్టెంట్ డైరెక్టర్ వసంత, ఆమ్నీ మెడికల్ ఎండీ శ్రీధర్, నాగరాజు, తేజ్ ఫార్మాకు చెందిన సుధాకర్‌రెడ్డితోపాటు పలువురు ఉద్యోగులు కుమ్మక్కయి అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు.
నిబంధనలకు విరుద్ధంగా నకిలీ బిల్లులు, తప్పుడు రికార్డులతో టెండర్లు లేకుండా మందులకు ఆర్డర్లు ఇచ్చినట్లు తేలింది. దీనిపై ఏసీబీ ఏడు కేసులు నమోదు చేసింది. దేవికారాణిసహా పలువుర్ని అరెస్ట్ చేసింది. తర్వాత వారు బెయిల్ పై విడుదలయ్యారు. ఏసీబీ కేసుల ఆధారంగా ఈడీ కూడా విచారణ ప్రారంభించి పలువు ఇళ్లలో సోదాలు నిర్వహించింది.
దివంగత మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడి ఇంట్లోనూ సోదాలు నిర్వహించడం కలకలం నాయిని అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి, ముకుందరెడ్డి బంధువు వినయ్ రెడ్డి ఇళ్లలో సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లుగా ప్రచారం జరిగింది. అయితే ఈ కేసు విషయంలో ఆయన పాత్రపై ఇంకా స్పష్టమైన సమాచారం బయటకు రాలేదు. ఈఎస్ ఐ స్కాంలో ఇప్పటికే ఏసీబీ కేసులు నడుస్తున్నాయి. అదనంగా ఈడీ ఆస్తులు కూడా అటాచ్ చేసింది