Begin typing your search above and press return to search.

ప్రముఖులను ఈడీ అదుపులోకి తీసుకున్నదా ?

By:  Tupaki Desk   |   22 Sep 2022 8:30 AM GMT
ప్రముఖులను ఈడీ అదుపులోకి తీసుకున్నదా ?
X
ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి దర్యాప్తు చేస్తున్న ఎన్పోర్స్ మెంటు డైరెక్టరేట్ (ఈడీ) కొందరు ప్రముఖులను విచారిస్తోందట. అది కూడా కొంతమందిని రహస్యంగా విచారిస్తున్నట్లు మీడియాలో కథనాలు కలకలం సృష్టిస్తున్నాయి.

లిక్కర్ కుంభకోణానికి మూలాలన్నీ హైదరాబాద్ లోనే ఉన్నట్లు ఇప్పటికే ఈడీ నిర్ధారణకు వచ్చిందట. ఇందులో భాగంగానే పదే పదే అనేక మందిపై ఈడీ దాడులు చేస్తోంది. రెగ్యులర్ గా ఢిల్లీ నుండి హైదరాబాద్ రావటం, ఎక్కడో ఒకచోట విచారణ చేయటం పెద్ద సమస్యగా మారిందట.

ఇందుకని ఈడీ ప్రత్యేకంగా హైదరాబాద్ లో అన్ని వసతులతో ఉన్న పెద్ద ఆఫీసునే ఏర్పాటుచేసుకున్నదట. దాంతో తాము ఎవరిని అదుపులోకి తీసుకునేది, విచారణ చేస్తున్నది బయట వాళ్ళకు తెలిసే అవకాశాలు తక్కువని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే హైదరాబాద్ లో ఉంటున్న ఒక ఫార్మాకంపెనీ యాజమాన్యాన్ని కూడా అదుపులోకి తీసుకున్నదట. ఈ యజమాని వైసీపీ ప్రభుత్వంలోని ప్రముఖుడికి దగ్గర బంధువు కూడానట.

ఫార్మాకంపెనీ యాజమానితో పాటు మరో ఇద్దరు సాఫ్ట్ వేర్ కంపెనీల యజమానులను+ఇప్పటికే అదుపులోకి తీసుకున్న వెన్నంనేని శ్రీనివాస్ ని కూడా విచారిస్తున్నారట. ఇద్దరు సాఫ్ట్ వేర్ కంపెనీల యజమానులను విచారించే సమయంలోనే తెలంగాణాలోని అధికార పార్టీ లోని కీలక వ్యక్తుల ప్రమేయానికి సంబంధించిన లింకులు బయటపడ్డాయట. ఇప్పటికే అదుపులో ఉన్న ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు ఆఫీసులో సోదాలు చేసినపుడు కొన్ని ఫైళ్ళు తిరగేస్తుంటే కొందరు రాజకీయ నేతల పేర్లు కనిపించాయట.

సరే ఆడిటర్ అన్నా అనేకమంది క్లైంట్లుంటారు. వీరిలో రాజకీయ నేతలుండటం చాల సహజం. అయితే బయటపడిన పేర్లను ఆడిటర్ తో ప్రస్తావించినపుడు కొన్ని అనుమానిత లావాదేవీలు బయటపడినట్లు సమాచారం.

ఇద్దరు సాఫ్ట్ వేర్ కంపెనీల యాజమానుల విచారణలో కూడా అధికార పార్టీ ప్రముఖుల ప్రమేయం బయటపడిందట. కాబట్టి ఇపుడిప్పుడే లిక్కర్ కుంభకోణం దర్యాప్తు హైదరాబాద్ ను వదిలేట్లు లేదు. ఈ రహస్య విచారణలో ఎవరెవరి పేర్లు బయటపడతాయో చూడాల్సిందే.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.