Begin typing your search above and press return to search.
హెరిటేజ్ ఫ్రెష్ పై ఎన్ ఫోర్స్ మెంట్ దాడులు!
By: Tupaki Desk | 23 Jan 2018 9:42 AM GMTబాహుళ ఛైన్ రిటైల్ స్టోర్స్ ఉన్న హెరిటేజ్ ఫ్రెష్ పై తెలంగాణ పౌరసరఫరాల శాఖ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు దాడులు నిర్వహించటం చర్చనీయాంశంగా మారింది. మొయిన్ స్ట్రీమ్ మీడియాలో పెద్దగా ఫోకస్ కాని ఈ ఇష్యూ సికింద్రాబాద్ సింధీకాలనీలో చోటు చేసుకుంది.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఎలాంటి లైసెన్సులు లేకుండా గడిచిన కొద్దినెలలుగా నూనెలు విక్రయిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ అంశంపై ఫిర్యాదు అందటంతో పౌరసరఫరాల శాఖ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం అధికారులు హెరిటేజ్ ఫ్రెష్ మీద తనికీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అక్రమంగా నిల్వ ఉంచిన వంట నూనెను స్వాధీనం చేసుకున్నారు. సింధ్ శాఖకు చెందిన హెరిటేజ్ నిర్వాహకులపై కేసు నమోదు చేసిన అధికారులు.. అక్రమంగా నిల్వ ఉంచిన 1700 లీటర్ల వంట నూనెను స్వాధీనం చేసుకున్నారు. ఒక ప్రముఖ గ్రూపునకు చెందిన శాఖలో లైసెన్సులు పొందకుండా అక్రమంగా నిల్వ ఉంచిన తీరు ఆసక్తికరంగా మారటమే కాదు.. చర్చ జరిగేలా చేసింది.