Begin typing your search above and press return to search.

వేరే వ్యక్తితో నిశ్చితార్థం అయినా వదల్లేదు.. వీడియోలు చూపించి మరీ పెళ్లి వరకూ అత్యాచారం

By:  Tupaki Desk   |   9 Jun 2022 3:30 PM GMT
వేరే వ్యక్తితో నిశ్చితార్థం అయినా వదల్లేదు.. వీడియోలు చూపించి మరీ పెళ్లి వరకూ అత్యాచారం
X
అక్రమ సంబంధాలు జీవితాలను నాశనం చేస్తున్నాయి. పెళ్లికి ముందు ఏర్పాటు చేసుకున్న బంధాలు వారి జీవితానికే ఎసరు పెడుతున్నాయి. ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువకుడు సాంతాం వాడుకున్నాడు.

ఎంతలా అంటే ఆమెకు వేరే వ్యక్తితో నిశ్చితార్థం అయినా పెళ్లికి ముందు వరకూ కూడా పాత సన్నిహితంగా ఉన్న వీడియోలు చూపించి బెదిరించి తన కామవాంఛను తీర్చుకున్నాడు. చివరకు పెళ్లి కూడా రద్దు చేయించాడు. యువతి గర్భం దాల్చడంతో ఇప్పుడు ఇతగాడు పెళ్లికి నిరాకరించాడు. విసిగి వేసారిన యువతి పోలీస్ స్టేషన్ గడపతొక్కింది.

హైదరాబాద్ తిరుమలగిరి విలేజ్ దర్గా ప్రాంతానికి చెందిన యువతి లెక్చరర్ గా పనిచేస్తోంది. 2017లో ఆమెకు అత్తాపూర్ కిషన్ బాగ్ ప్రాంతానికి చెందిన దూరపు బంధువు నిహాల్ సింగ్ తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమకు దారితీసింది.

గత ఏడాది జూలై 1న అత్తాపూర్ వెళ్లిన యువతిని నిహాల్ సింగ్ టెర్రస్ పైన ఉన్న గదికి తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత కూడా నిహాల్ సింగ్ పలు మార్లు లాడ్జీలకు తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. కాగా బాధితురాలు గత డిసెంబర్ లో తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని చెప్పగా.. నిశ్చితార్తం జరిగినా తాను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అప్పుడూ అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఇక విసిగి వేసారిన యువతి వేరే వ్యక్తితో ఫిబ్రవరిలో నిశ్చితార్థం చేసుకుంది. తనను వదిలేయాలని నిహాల్ సింగ్ ను కోరింది. అయినా వదలకుండా తనతో కలిసి ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో పెడుతానని.. కాబోయే భర్తకు పంపిస్తానని బెదిరించి తన కోరికను తీర్చుకున్నాడు. పెళ్లికి ముందు వరకూ లైంగిక దాడికి పాల్పడ్డాడు.

ఇక నిహాల్ సూచన మేరకు యువతి పెళ్లి కూడా రద్దు చేసుకుంది. అయితే ఇటీవల యువతి గర్భం దాల్చడంతో తనను పెళ్లి చేసుకోవాలని నిహాల్ సింగ్ ను యువతి కోరింది. దీనికి నిహాల్ పెళ్లి చేసుకోనని తేల్చిచెప్పడంతో మోసపోయిన యువతి మంగళవారం తిరుమలగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.