Begin typing your search above and press return to search.
హనీ ట్రాప్: కీలక మిస్సైల్ వివరాలు పాక్ చేతికి
By: Tupaki Desk | 21 Jun 2022 8:35 AM GMTజాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రతిసారి ఇలాంటి కేసులను ఛేధిస్తూనే ఉంటుంది... 'ఆపరేషన్ డాల్ఫిన్ నోస్' అని పేరు పెట్టి చేస్తున్న ఈ దర్యాప్తులో ఇప్పటికే ముంబైలో మహ్మద్ హరూన్ హజీ అబ్దుల్ రెహమాన్ లక్డావాలా (49) అనే అనే వ్యక్తిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. వ్యాపార నిమిత్తం కరాచీ వెళ్లి అక్కడ ఐఎస్ఐ ఏజెంట్ల ను కలిసిన లక్డావాలా అక్కడి నుంచి నగదు బదిలీ చేయించారు.
నేవీ ఉద్యోగులను అమ్మాయిలతో లోబరుచుకొని వారి బ్యాంకు ఖాతాలకు వివిధ మార్గాల ద్వారా నగదు జమ చేయడంలో కీలకంగా వ్యవహరించారు.భారత నౌకదళానికి చెందిన సబ్ మెరైన్లు, యుద్ధ నౌకల మోహరింపు సమాచారాన్ని పాక్ కు చేరవేసినట్టు గత ఏడాది డిసెంబర్ 20న నిఘా విభాగం పసిగట్టింది.
దర్యాప్తు చేసి 14మందిని అరెస్ట్ చేసింది. పాకిస్తాన్ కు చెందిన షాయిస్తా క్వయిజర్ అనే యువతిని కూడా అరెస్ట్ చేవారు. ఇక తొలుత ఏడుగురు భారత నేవీ ఉద్యోగులు.. ఈ ఏడాది మరో ముగ్గురిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. వీరు పాకిస్తాన్ హనీట్రాప్ లో పడి మన రహస్యాలు చేరవేసినట్టు గుర్తించారు.
తాజాగా రక్షణ శాఖకు చెందిన తెలంగాణ ఇంజినీర్ కూడా ఈ పాకిస్తానీ హనీట్రాప్ లో అడ్డంగా బుక్కయ్యాడు. కంచన్ బాగ్ డీఆర్డీఎల్ ఇంజినీర్ మల్లికార్జున రెడ్డి హనీట్రాప్ వ్యవహారంలో కీలక విషయాలను పోలీసులు సేకరించారు. నటాషా పేరుతో పాక్ ఏజెంట్ అతడిని ట్రాప్ చేసింది.
ఈ క్రమంలోనే సబ్ మెరైన్ నుంచి మిస్సైల్ లాంచ్ చేసే కీలక కే-సిరీస్ కోడ్ ను అతడు చేరవేశాడని తేలింది. మూడేళ్లు మిస్సైల్ కాంపోనెంట్స్ డేటాను పంపాడు. అతడి మొబైల్ లో ఇంగ్లీష్, హిందీలో ఉన్న నటాషా వాయిస్ రికార్డింగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఆన్ లైన్ డేటింగ్ సైట్స్ లో మహిళలను ఎరగా వేసి మన రక్షణ శాఖ సిబ్బందిని పాకిస్తానీ హనీట్రాప్ గ్రూపులు ఆకర్షిస్తున్నాయి. తరువాత బ్లాక్ మెయిల్ చేసి మీ చాటింగ్ బయటపెడుతామని జలాంతర్గములు, యుద్ధ నౌకలు, నౌకా స్థావరాల రహస్యాలను ఐఎస్ఐ కాజేస్తుంటుంది. ఈ ఉచ్చులో మన వాళ్లు పడి ఇప్పుడు అడ్డంగా బుక్కవుతున్నారు.