Begin typing your search above and press return to search.
రాష్ట్రపతికి పాదనమస్కారం... సస్పెండ్ అయిన.. ఇంజనీర్!
By: Tupaki Desk | 15 Jan 2023 7:30 AM GMTదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పాదనమస్కారం చేసిన ఓ మహిళా ఇంజనీర్‌ను రాజస్థాన్ ప్రభుత్వం విధుల నుంచి సస్పెండ్ చేసింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజస్థాన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమెకు విమానాశ్రాయంలో సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ సహా.. పలువురు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.
ఇదే కార్యక్రమానికి హాజరైన పిడబ్ల్యుడి.. చీఫ్ ఇంజనీర్, మహిళా అధికారి ఒకరు వచ్చారు. స్వాగతం పలుకుతున్న సమయంలో ఆమె అనూహ్యంగా రాష్ట్రపతికి పాదనమస్కారం చేసేందుకు వంగారు. అయితే.. ఈ నమస్కారాన్ని సున్నితంగా తిరస్కరించిన రాష్ట్రపతి అక్కడ నుంచి వెళ్లిపోయారు. అయితే.. ఇది జరిగిన రెండురోజులకు సదరు మహిళా అధికారిని సస్పెండ్ చేస్తూ.. రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటన సంచలనంగా మారింది.
నిజానికి ఎస్టీ కమ్యూనిటీకి చెందిన రాష్ట్రపతిని గౌరవించడం తప్పుకాదు. పైగా రాష్ట్రపతికి సామాజిక వర్గాలు అంటగట్టకుండానే గౌరవించడం తప్పుకాదు. కాని, ఇక్కడ రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం.. రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకు పోటీగా.. మాజీ బీజేపీ నాయకుడిని రంగంలోకి దింపడం తెలిసిందే. ఇక, తరచుగా కాంగ్రెస్ నేతలు.. రాష్ట్రపతి నిర్ణయాలపై గుస్సాగా ఉండడం తెలిసిందే.
ఈ పరిణామాల క్రమంలోనే తమ ప్రభుత్వంలో పనిచేస్తున్న మహిళా అధికారి ఇలా.. రాష్ట్రపతికి పాదనమస్కారం చేయడం ఏంటనే విషయంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మొత్తానికి రాష్ట్రపతి కి పాదనమస్కారం చేయబోయిన మహిళ ఇప్పుడు ఇంటికే పరిమితం కావడం గమనార్హం.