Begin typing your search above and press return to search.

ఇంగ్లండ్ ఆల్ రౌండర్ కు విమానంలో చేదు అనుభవం..!

By:  Tupaki Desk   |   5 Jan 2023 7:32 AM GMT
ఇంగ్లండ్ ఆల్ రౌండర్ కు విమానంలో చేదు అనుభవం..!
X
ఇంగ్లండ్ ఆల్ రౌండర్ శామ్ కరన్ ఐపీఎల్-2023 వేలంలో అత్యధిక ధరను దక్కించుకొని రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. గత టీ20 వరల్డ్ కప్ లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకొని జట్టు విజయంలో కరన్ కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలోనే కరన్ ఐపీఎల్ వేలంలో దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తిని కనబరిచాయి.

ముంబై.. బెంగళూరు.. లక్నో.. చెన్నై.. రాజస్థాన్.. పంజాబ్ టీమ్ నిర్వాహాకులు కరన్ ను దక్కించుకునేందుకు వేలంపాట పెంచుతూ పోయాయి. దీంతో చివరకు పంజాబ్ కింగ్స్ రూ.18.50 కోట్లకు కరన్ ను దక్కించుకుంది. అంతకు ముందు వరకు దక్షిణాఫ్రికా మాజీ ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ అత్యధికంగా రూ.16.25 కోట్లకు అమ్ముడయ్యాడు. ఆ రికార్డును కరన్ 2023 ఐపీఎల్ వేలంలో తిరగరాసి వార్తల్లో నిలిచాడు.

కాగా వర్జిన్ అట్లాంటిస్ ఎయిర్ లైన్స్ సిబ్బంది నిర్వాహకంతో ఈ ఆటగాడు మరోసారి వార్తల్లో నిలిచాడు. బుధవారం రోజున వర్జిన్ అట్లాంటిస్ కు చెందిన ఎయిర్ లైన్స్ లో ప్రయాణించేందుకు శామ్ కరణ్ టికెట్ బుక్ చేసుకున్నాడు. అయితే అతడి ప్రయాణానికి ముందే తనకు కేటాయించిన సీటు విరిగిపోయిందని.. మీరు అందులో ప్రయాణించడానికి కుదరదని ఎయిర్ లైన్స్ సిబ్బంది తనను విమానం ఎక్కకుండా అడ్డుకున్నట్లు కరన్ ఈ మేరకు ఒక ట్వీట్ చేశాడు.

వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్ లైన్స్ సిబ్బంది తనను విమానం ఎక్కడానికి నిరాకరించడం పిచ్చితనంగా కన్పించిందని పేర్కొన్నాడు. ఈ సంఘటన తనకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించడంతో పాటు దిగ్భ్రాంతికి గురిచేసిందని కరన్ తన ట్వీటర్లో పేర్కొన్నాడు. అంతేకాకుండా వర్జిన్ అట్లాంటిక్ కరన్ ధన్యవాదాలు సైతం తెలియజేశాడు. అయితే కరన్ తాను ఎక్కడికి ప్రయాణిస్తున్నాడో మాత్రం వెల్లడించలేదు.

కరన్ ట్వీట్ పై వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్ లైన్స్ తాజాగా స్పందించింది. 'హాయ్ కరణ్.. ఇలా జరగడం చాలా బాధాకరం.. దీనికి చింతిస్తున్నాం.. ఒకవేళ మీరు ఈ విషయాన్ని మా హెల్ప్ లైన్ డెస్క్ దృష్టికి తీసుకొస్తే.. వారు అప్పుడే సంతోషంగా మరో విమానంలో సీటు కేటాయించే వారు.. మీ ఫీడ్ బ్యాక్ మా కస్టమర్ కేర్ కు పంపొచ్చు' అంటూ రిప్లయ్ ఇచ్చింది.

ఈ క్రమంలోనే కరన్ కు మద్దతుగా అభిమానులు 'మాకు సైతం గతంలో ఇలానే జరిగిందని.. ఆ సంస్థ మెనేజ్మెంట్ సరిగా స్పందించడం లేదంటూ' కామెంట్స్ చేస్తున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.