Begin typing your search above and press return to search.
భారత్ తో టెస్ట్: ఇంగ్లండ్ ఆటగాళ్ల బాల్ ట్యాంపరింగ్?
By: Tupaki Desk | 16 Aug 2021 5:01 AM GMTబాల్ ట్యాంపరింగ్.. క్రికెట్ లో ఇదో పెద్ద వివాదం.. గత 2018 సంవత్సరంలో కేప్ టౌన్ లో జరిగిన టెస్ట్ గుర్తుండే ఉంటుంది. ఆ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడడం క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసింది. అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ సహా బ్యాట్స్ మెన్ బెన్ క్రాఫ్ట్ నిషేధానికి గురయ్యారు.
తాజాగా అలాంటి ఘటనే ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లండ్, ఇండియా రెండో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా చోటుచేసుకోవడం పెద్ద వివాదాస్పదమైంది. ఇంగ్లీష్ క్రికెటర్లు బ్యాల్ ట్యాంపరింగ్ కోసం కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు.
నాలుగోరోజైన ఆదివారం భారత్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా షూస్ కు ఉండే పదునైన మొలలతో బంతిని తొక్కడం కెమెరా కంటపడింది. బంతిని ఉద్దేశపూర్వకంగా కిందపడేసి బూట్లతో తన్నారు. ఎవరో తెలియదు కానీ.. లంచ్ తర్వాత ఇద్దరు ఇగ్లండ్ ఆటగాళ్లు బంతిని అటూ ఇటూ తంతూ దానిపై ముద్రలు వేయడం ఫొటోలు, వీడియోల్లో కనిపించింది.
బంతిని ట్యాంపర్ చేసేందుకు ఇంగ్లీష్ బౌలర్లు మూడు సార్లు ప్రయత్నించినట్టు వెలుగులోకి వచ్చిన ఫొటోల ద్వారా తెలుస్తోంది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దుమారం రేపింది.
దీనిపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరంద్ర సెహ్వాగ్ మండిపడ్డారు. ‘ఇంగ్లీష్ ప్లేయర్లు అసలేం జరుగుతోంది. ఇది బాల్ టాంపరింగ్ కాదా? లేదా కరోనా నివారణ చర్య’నా అని ట్వీట్ చేశాడు. ఇక ఇది బాల్ ట్యాంపరింగేనని భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా స్పష్టం చేశాడు.
అయితే ఇంగ్లండ్ సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ మాత్రం ఇది సాధారణం అని.. ప్రమాదవశాత్తూ బంతిని తన్ని ఉంటాడని.. వీడియోను చూస్తే పూర్తిగా అర్థమవుతుందని అంటున్నాడు.
ఈ వివాదంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సైతం దీనిపై స్పందించాల్సి ఉంది. కావాలనే చేస్తే మాత్రం ఆటగాళ్లపై కఠిన చర్యలు తప్పవు.