Begin typing your search above and press return to search.
ఇండియాకు షాక్ : ఆస్ట్రేలియా వీసాల రద్దు
By: Tupaki Desk | 23 March 2018 6:30 PM GMTఅమెరికా - బ్రిటన్ తోపాటు సింగపూర్ - ఆస్ట్రేలియా - న్యూజీలాండ్ దేశాలు వీసా నిబంధనలను కఠినతరం చేయడం, అంతర్జాతీయ మార్కెట్ లో అనిశ్చితి కారణంగా ఐటీ వ్యయాలు తగ్గడంతో భారత సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీపై గత ఏడాది ఒత్తిడి పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో ఆ ఏడాదంతా నిరాశలే కమ్ముకున్నాయి. అయితే ఈ ఏడాది కొద్దిగా పరిస్థితులు సద్దుమణగుతున్న సమయంలో ఆస్ట్రేలియా మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. 457 వీసా ప్రోగ్రామ్ ను రద్దు చేసి ఇండియన్స్‌కు భారీ షాకిచ్చింది ఆస్ట్రేలియా.
అమెరికా బాటలోనే ఇప్పుడు ఆస్ట్రేలియన్స్ ఫస్ట్ నినాదంతో ఆ దేశం ముందుకెళ్తోంది. ఈ క్రమంలోనే 457 వీసా ప్రోగ్రామ్ ను రద్దుచేసింది. దీనిని ఎక్కువగా ఇండియన్సే వాడేవారు. దీని స్థానంలో మరిన్ని కఠిన నిబంధనలతో టెంపరరీ స్కిల్స్ షార్టేజ్ వీసా ప్రోగ్రామ్ ను ప్రారంభించింది. కొత్త నిబంధనల ప్రకారం ఇంగ్లిష్‌పై మంచి పట్టు ఉండటంతో మరింత నైపుణ్యం ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతి ఏటా ఈ 457 వీసా ప్రోగ్రామ్ కింద 95 వేల మంది విదేశీ ఉద్యోగులకు ఆస్ట్రేలియాలో పనిచేసే అవకాశం దక్కేది.
457 వీసా కింద నైపుణ్యం ఉన్న ఆస్ట్రేలియా వర్కర్ల కొరత ఉన్నపుడు గరిష్ఠంగా నాలుగేళ్ల వరకు విదేశీ వర్కర్లను తీసుకునే అవకాశం అక్కడి కంపెనీలకు ఉంటుంది. ఇందులో చాలావరకు ఇండియన్సే ఉండేవారు. 95 వేల వీసాల్లో 25 శాతం భారతీయులకే దక్కేవి. ఆ తర్వాతి స్థానాల్లో 19.5 శాతంతో యూకే - 5.8 శాతంతో చైనా ఉండేవి. ఈ వీసా తీసుకున్న విదేశీ వర్కర్లు ఫ్యామిలీతో పాటు ఆస్ట్రేలియాలో నివాసం ఉండే చాన్స్ ఉంటుంది. అయితే ఈ వీసా ప్రోగ్రామ్ వల్ల స్థానిక ఆస్ట్రేలియన్లకు ఉద్యోగాలు దొరకడం లేదన్న విమర్శలు ఎక్కువయ్యాయి. దీంతో ఈ 457 వీసా ప్రోగ్రామ్‌ను రద్దు చేస్తున్నట్లు గతేడాది ఏప్రిల్ లోనే ప్రధాని మాల్కమ్ టర్న్‌బుల్ ప్రకటించారు.