Begin typing your search above and press return to search.

సెమీస్ లో ఇంగ్లండ్ విజయం.. భారత్ ఘోర ఓటమి

By:  Tupaki Desk   |   10 Nov 2022 11:48 AM GMT
సెమీస్ లో ఇంగ్లండ్ విజయం.. భారత్ ఘోర ఓటమి
X
టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా కథ సెమీ ఫైనల్ లోనే ముగిసింది. ఫైనల్ కు చేరుతుంది.. ఫైనల్ లో పాకిస్తాన్ ను ఓడించి కప్ కొడుతుంది అని అందరూ అనుకుంటున్న వేళ సెమీస్ లోనే టీమిండియా ఇంటిదారి పట్టడాన్ని ఏ భారత అభిమాని జీర్ణించుకోవడం లేదు. టీమిండియా విధించిన 169 పరుగుల లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా ఇంగ్లండ్ చేధించి చిత్తుచిత్తుగా ఓడించింది. ఇంగ్లండ్ ఓపెనర్లే 170 పరుగులను కొట్టేసేశారంటే మన బౌలింగ్ ఎంత తేలిపోయిందో అర్థం చేసుకోవచ్చు.

గ్రూప్ దశలో బాగానే బౌలింగ్ చేసిన భారత బౌలర్లు కీలకమైన సెమీస్ లో కనీసం ఒక్కటంటే ఒక్క వికెట్ ను కూడా తీయలేకపోయారు. ఇక భారత్ బ్యాటింగ్ కూడా ఏమాత్రం సరిపోలేదు. విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యా తప్పితే ఎవ్వరూ పెద్దగా ఆడలేదు.

టాప్ ఆర్డర్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కేఎల్ రాహుల్ మరోసారి సింగిల్ డిజిట్ కే ఔట్ అయిపోయాడు. ఇక కెప్టెన్ రోహిత్ తేలిపోయాడు. సూర్యకుమార్ యాదవ్ మ్యాజిక్ కూడా పనిచేయలేదు. కోహ్లీ 50, హార్ధిక్ 63 పరుగులతో బాగానే ఆడి టీమిండియాకు 168 పరుగులు చేసేలా కష్టపడ్డారు.

అయితే ఇంగ్లండ్ ఓపెనర్లే ఈ టోటల్ ను కొట్టేసి భారత్ కు భారీ ఓటమిని తెచ్చిపెట్టారు. ఇద్దరూ రెచ్చిపోయి ఆడి టీమిండియా బౌలింగ్ ను తుత్తునియలు చేశారు. కెప్టెన్ జోస్ బట్లర్ 80, మరో ఓపెనర్ అలెక్స్ హేల్స్ 86 పరుగులతో దంచికొట్టి టీమిండియాకు ఘోర పరాజయాన్ని మిగిల్చారు.

సెమీస్ లో గెలిచి ఫైనల్ లో పాకిస్తాన్ ను ఓడించి కప్ కొడుతుందనుకున్న టీమిండియా ఇలా గ్రూప్ దశలోనే ఓడిపోవడం చూసి చివరకు కెప్టెన్ రోహిత్ డగౌట్ లో కంటతడి పెట్టుకోవడం గమనార్హం. రోహిత్ నే కాదు దేశమంతా ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ ఏడుపులే కనిపిస్తున్నాయి. కప్ కల చెదిరిపోవడమే కారణం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.