Begin typing your search above and press return to search.

నగ్నంగా కీపింగ్.. ఆందులోనూ ఆడ క్రికెటర్.. కారణం ఇదీ

By:  Tupaki Desk   |   15 Aug 2019 9:22 AM GMT
నగ్నంగా కీపింగ్.. ఆందులోనూ ఆడ క్రికెటర్.. కారణం ఇదీ
X
ఇంగ్లాండ్‌ మహిళా క్రికెటర్‌ సారా టేలర్‌ ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసిన ఓ ఫొటో సంచలనంగా మారింది. ఆమె నగ్నంగా వికెట్ కీపింగ్ చేస్తున్న చిత్రాన్నిపోస్ట్ చేసింది. మహిళల శరీరం, ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించేందుకే ఈ పనిచేశానంటున్నారామె.

'' నేను కంపర్ట్ జోన్ నుండి కొద్దిగా బయటకు వచ్చాను. నా గురించి తెలిసిన వారికి ఈ విషయం అర్థమైవుంటుంది. అయితే వుమెన్స్ హెల్త్ హక్ వారు నన్ను మహిళా సాధికారత కోసం ఏదైనా చేయాలని ఆహ్వానించినపుడు చాలా గర్వంగా అనిపించింది. శారీరకంగా గతంలో నేను కూడా ఎన్నో సమస్యలతో బాధపడ్డాను. అయితే అందులో కొన్నింటి నుండి నేను బయటపడగలిగాను. కాబట్టి ప్రతి మహిళా తన శారీరక సమస్యలపై అవగాహన కలిగివుండాలి. కానీ చాలా మంది సిగ్గు, బిడియం తదితర కారణాలతో ఆ పని చేయలేరు. అలాంటి వారిలో మార్పు కోసమే తాను ఈ ఫోటోను మీతో పంచుకున్నాను. ఎవరో ఏదో అనుకుంటారన్న భయంతో మనలోని సమస్యను దాచిపెట్టి బాధపడటం మానండి. ప్రతి ఒక్క మహిళా తన శారీరక సమస్యల గురించి బహిరంగంగా మాట్లాడగలగాలి. అప్పుడే మహిళా సాధికారత సాధ్యపడుతుంది. చివరగా ప్రతి అమ్మాయికి ఎదుటివారే తనకంటే అందంగా వున్నారని అనిపిస్తుంది. కానీ తనతో పాటు ప్రతీ మహిళా అందమైనవారేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. '' అంటూ టేలర్ ఫోటోతో పాటు సందేశం కూడా రాశారు.

ఇంగ్లండ్ మహిళ జట్టుకు ఆమె వికెట్ కీపర్ గా వ్యవహరిస్తున్న సారా టేలర్... 17 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్ లో అడుపెట్టి అంత్యంత యంగ్ మహిళా క్రికెటర్ గా గుర్తింపు పొందింది. అలా కెరీస్ ప్రారంభించిన ఆమె వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తునే బ్యాటింగ్ లో అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇస్తోంది. దూకుడైన ఆటతీరుతో 19 ఏళ్ల కే 1000 పరుగులు పూర్తి చేసుకున్న మహిళా క్రికెటర్ గా ఘనత సాధించింది. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో మిథాలీ సేనను ఓడించడంలో కీలక పాత్ర పోషించింది ఆమెనే.