Begin typing your search above and press return to search.

మీరెప్పుడూ విన‌ని క్రికెట్ రికార్డు ఇది

By:  Tupaki Desk   |   13 Aug 2017 4:11 AM GMT
మీరెప్పుడూ విన‌ని క్రికెట్ రికార్డు ఇది
X
క్రికెట్‌కు పుట్టినిల్లు ఇంగ్లాండ్ గా అభివ‌ర్ణిస్తుంటారు. కానీ.. అలాంటి దేశం ఇప్ప‌టివ‌ర‌కూ ప్ర‌పంచ క్రికెట్ క‌ప్ ను సొంతం చేసుకోక‌పోవ‌టాన్ని ప‌లువురు ప్ర‌స్తావిస్తుంటారు. ఇక‌.. ప‌లు రికార్డుల్ని సైతం ప‌లు దేశస్తులు నెల‌కొల్పుతుంటారు. పుట్టింట వారు నెల‌కొల్ప‌లేని ఎన్నో రికార్డుల్ని వివిధ దేశ‌స్తులు చేస్తున్న వేళ‌.. ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేయ‌రా? అన్న సందేహం మ‌దిని ప‌ట్టి పీడిస్తుంద‌ని చెప్పాలి. ఇలాంటి ప్ర‌శ్న‌ల‌కు తాజాగా త‌న బంతితో స‌మాధానం ఇచ్చాడో ఇంగ్లాండ్ క్రికెట‌ర్‌.

ఇప్ప‌టివ‌ర‌కూ ఒక ఓవ‌ర్లో వ‌రుస‌గా ఆరు సిక్స‌ర్లు బాదేసిన రికార్డు చూశారు. దాన్ని సాధించినోడు మ‌న యువ‌రాజ్ సింగ్‌. మరి.. ఒక ఓవ‌ర్లో వ‌రుస‌గా ఆరు వికెట్లు ప‌డితే? వ‌రుస‌గా మూడు వికెట్లు ప‌డితేనే హ్యాట్రిక్ అంటూ హ‌డావుడి చేసేస్తుంటారు. అలాంటిది డ‌బుల్ హ్యాట్రిక్ సాధ్యం కావ‌టం అసాధ్య‌మ‌న్న స్టేట్ మెంట్ ఇవ్వ‌కండి.

ఎందుకంటే.. తాజాగా అలాంటి అరుదైన రికార్డును సృష్టించాడో ఇంగ్లాండ్ బౌల‌ర్‌. ఒకే ఓవ‌ర్లో ఆరుగురు బ్యాట్సె్ మ‌న్ల‌ను వ‌రుస‌గా పెవిలియ‌న్‌ కు పంపి తిరుగులేని రికార్డును సృష్టించాడు. ఇంతా చేసి ఆ క్రికెట‌ర్ వ‌య‌సు ఎంతో తెలుసా? అక్ష‌రాల ప‌ద‌మూడేళ్లు మాత్ర‌మే.

అరుదైన రికార్డును సొంతం చేసుకున్న ప‌ద‌మూడేళ్ల ల్యూక్ రాబిన్ స‌న్ ఇప్పుడు క్రికెట్ ప్ర‌పంచంలో తాజా సంచ‌ల‌నంగా మారారు. ఫిల‌డెల్ఫియా క్రికెట్ క్ల‌బ్ అండ‌ర్ 13 జ‌ట్టులో ఆడుతుంటాడు. తాజాగా ఒక క్ల‌బ్ త‌ర‌ఫున ఓ మ్యాచ్ లో పాల్గొన్న అత‌గాడు ఒక ఓవ‌ర్లో వ‌రుస‌గా ఆరు బంతుల్లో ఆరు వికెట్లు తీసి అద్భుత‌మైన రికార్డును సృష్టించాడు. ల్యూక్ రికార్డును స్వ‌యంగా చూసిన అత‌ని కుటుంబ స‌భ్యుల‌కైతే.. వారి ఆనందం మాట‌ల్లో వ‌ర్ణంచ‌లేని ప‌రిస్థితి. సీనియ‌ర్ క్రికెట‌ర్ అయిన ల్యూక్ తండ్రి స్టీఫెన్ రాబిన్ స‌న్ మాట్లాడుతూ.. 30 ఏళ్ల నుంచి తాను క్రికెట్ ఆడుతున్నాన‌ని.. ఒకే ఓవ‌ర్లో ఆరుగురు బ్యాట్స్ మెన్ల‌ను బౌల్డ్ రూపంలో పెవిలియ‌న్‌కు పంప‌టం ఎక్క‌డా చూడ‌లేద‌ని.. ఆ ఘ‌న‌త‌ను సాధించిన క్రికెట‌ర్ త‌న కొడుకు కావ‌టం చాలా సంతోషంగా ఉందంటూ ఎగ్జైట్ అయిపోతున్నాడు. ల్యూక్ లాంటి రికార్డును సొంతం చేసుకున్న‌ప్పుడు ఏ తండ్రికి మాత్రం హ్యాపీగా ఫీల్ కాకుండా ఉండ‌గ‌ల‌రు?