Begin typing your search above and press return to search.

లాక్ డౌన్: శృంగారానికి బెస్ట్ టైం..ఇలా చేస్తే సుఖం

By:  Tupaki Desk   |   11 April 2020 11:30 PM GMT
లాక్ డౌన్: శృంగారానికి బెస్ట్ టైం..ఇలా చేస్తే సుఖం
X
దేశమంతా లాక్ డౌన్ లో ఉంది. అందరూ ఇళ్లలోనే ఉన్నారు. ఉద్యోగాలు చేసే భార్యభర్తలకు కావాల్సినంత సమయం దొరికింది. నెలకు ఒకసారి కూడా కలుసుకోని వారు ఇప్పుడు 24 గంటలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. భర్త ఖాళీగా ఉండడంతో ఊకే అదే యావతో సతాయిస్తున్నాడని కొన్ని ఇళ్లలో గొడవలు కూడా జరుగుతున్నాయి. కానీ ఈ ఖాళీ టైంలో భార్య భర్త మధ్య బంధం బలపడడానికి శృంగారానికి మించిన దివ్యౌషధం మరోటి లేదని సెక్సాలజిస్టులు సూచిస్తున్నారు. ఇలాంటి వేళ శృంగార క్రీడ పెరిగిపోతోందని సర్వేలు చెబుతున్నాయి. ఆరోగ్యంతోపాటు ఎక్కువ కేలరీలు ఖర్చు కావాలంటే అర్జంట్ గా రతిక్రీడలో రెచ్చిపోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

లాక్ డౌన్ లో అందరూ రోమాన్స్ లో రెచ్చిపోతూ శృంగార జీవితాన్ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఖాళీ సమయంలో శృంగారాన్ని తనివి తీరా ఆస్వాదిస్తున్నారట.. శృంగారానికి ఇంతకు మించిన టైం దొరకదని నిపుణులు సూచిస్తున్నారు.

లాక్ డౌన్ ఎవరూ ఇళ్లు దాటి అడుగు బయటపెట్టడం లేదు. ఇక చుట్టాలు పక్కాలు, తోటి ఇంటి వారు కూడా కరోనా భయంతో మన ఇంటికి రావడం లేదు.దీంతో మీ పార్ట్ నర్ ఉంటే చాలు.. రోజంతా సెక్స్ లో రెచ్చిపోవచ్చు. మీకు నచ్చినట్టు ప్రయత్నించవచ్చు.

శృంగారం రోజూ చేస్తుంటే బోర్ కొట్టకుండా క్రియేటివ్ గా ప్లాన్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒక్కో రోజున ఒక్కోలా ప్లాన్ చేసుకోవాలని చెబుతున్నారు. ఓరోజు మధ్యాహ్నం.. మరోరోజు ఉదయం.. మరో రోజు సాయంత్రం.. ఇలా చేసుకోవాలి. ఈ ఏకాంతం ఖచ్చితంగా మీ భార్య భర్తల మధ్య దూరాన్ని తగ్గించి అనుబంధాన్ని పెంచుతుందంటున్నారు.

ఇద్దరిలో ఎవరికి శృంగార వాంఛ ఉన్నా వేరొకరికి లేకపోయినా సరే శృంగారంలో పాల్గొనాలని నిపుణులు సూచిస్తున్నారు. రోమాన్స్ కోసం రీజన్స్ వెతకొద్దని చెబుతున్నారు. పార్ట్ నర్ ను ప్రేరేపించి పని కానిచ్చేయండని సూచిస్తున్నారు. ఇది ఇరువురి మధ్య పటిష్ట బంధాన్ని బలపరుస్తుందని సెక్సాలజిస్టులు చెబుతున్నారు. సో ఇకేందుకు ఆలస్యం.. ఈ కరోనా టైంలో రెచ్చిపోండిక.. ఆల్ ది బెస్ట్..