Begin typing your search above and press return to search.
పోలవరం ఉచ్చు.. బాబు మెడకు బిగుస్తోంది..
By: Tupaki Desk | 15 July 2019 12:34 PM GMTఆంధ్రప్రదేశ్ కరువు తీర్చే అద్భుత ప్రాజెక్ట్ ‘పోలవరం’. వైఎస్ హయాంలో అనుకున్న ఈ ప్రాజెక్ట్ చంద్రబాబు పోయి జగన్ వచ్చినా ఇంకా సాగుతూనే ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్ నిర్మాణంపై వచ్చిన ఆరోపనలు అన్నీ ఇన్నీ కావు..చంద్రబాబు సర్కారు ఈ ప్రాజెక్ట్ పోరుతో దోచుకుందని..కేంద్రం నిధులను అడ్డగోలుగా దిగమింగిందన్న ఆరోపణలను బీజేపీ నేతలు చేశారు.
తాజాగా పోలవరం అక్రమాలపై చంద్రబాబు మెడకు ఉచ్చు బిగించేందుకు కేంద్రంలోని బీజేపీ రెడీ అయిపోయింది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల వేళ మోడీని గద్దెదించాలని చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు.అందుకే ఇప్పుడు బాబు ఏపీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోవడంతో ఆయన పని పట్టడానికి బీజేపీ రెడీ అయినట్లు కనిపిస్తోంది.
సోమవారం రాజ్యసభ సాక్షిగా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు సంచలన ప్రకటన చేశారు. పోలవరం ప్రాజెక్ట్ ను ఆసరాగా చేసుకొని టీడీపీ చేసిన అక్రమాలపై విచారణ జరిపిస్తామని.. ప్రధాని నరేంద్రమోడీని ఈ మేరకు అనుమతి కోరబోతున్నట్టు ఆయన ప్రకటించారు. బాబు అంటేనే పడని మోడీ ఎలాగూ సై అనేస్తారు.. దీంతో పోలవరంలో అక్రమాలు బాబు మెడకు చుట్టేందుకు బీజేపీ రెడీ అయినట్టు కనిపిస్తోంది.
పోలవరం ప్రాజెక్ట్ లో సహాయ పునరావాస ప్యాకేజీలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని జీవీఎల్ ఆరోపించారు. టీడీపీ పార్టీ ఈ ప్రాజెక్ట్ పేరుతో భారీగా ప్రజాధనాన్ని దోచుకుందని మండిపడ్డారు. లేని ఇళ్లను ఉన్నట్టుగా చూపి నష్టపరిహారం దండుకున్నారంటూ విమర్శించారు. చెట్లు, ట్యూబువెల్స్ పేరుతో ఆర్అండ్ ఆర్ ప్యాకేజీలో భారీగా డబ్బు దోచుకున్నారని రాజ్యసభలో ఆధారాలతో చూపించారు. ఈ నేపథ్యంలోనే పోలవరంపై కేంద్రం విచారణ చేయిస్తే చంద్రబాబు ఇరుక్కోవడం ఖాయమన్న అంచనాలు నెలకొంటున్నాయి.