Begin typing your search above and press return to search.

పాలిటిక్స్ లోకి పందెం కోడి

By:  Tupaki Desk   |   5 Feb 2018 12:14 PM GMT
పాలిటిక్స్ లోకి పందెం కోడి
X
సంక్రాతి పండుగ‌ అయిపోయింది. త్వ‌ర‌లో జ‌రిగే పందాల‌కు పందెం కోడి క‌త్తులు దూసేందుకు రెడీ అయ్యింది. మ‌రి ఆ కోడి పందెంలో గెలుస్తుందా..? లేక ప‌్ర‌త్య‌ర్ధి చేతిలో ఓడిపోతుందా అనేది చూడాల్సి ఉంది.

కోలీవుడ్ హీరో విశాల్ త్వ‌ర‌లో పార్టీ పెట్ట‌నున్నాడు. వెండితెర ఉద్దండులైన ర‌జ‌నీకాంత్ - క‌మ‌ల్ హాస‌న్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై దోబూచులాడుతున్న స‌మ‌యంలో విశాల్ ఆర్కేన‌గ‌ర్ ఎన్నిక‌ల బ‌రిలో దిగి అంద‌రికి షాక్ ఇచ్చాడు. ఆర్కేన‌గ‌ర్ లో స్వ‌తంత్ర్య అభ్యర్ధిగా పోటీ చేసి ఓట‌మి పాల‌య్యాడు. అయితే ఇప్ప‌డు తాను ప్ర‌త్యేక్ష రాజకీయాల్లో వ‌స్తున్నానంటూ హింట్ ఇచ్చాడు. 18నెల‌లుగా వాయిదా ప‌డుతున్న స్థానిక అసెంబ్లీ ఎన్నిక‌ల తేదీని ఈసీ ప్ర‌క‌టించిన వెంట‌నే పొలిట‌క‌ల్ ఎంట్రీ - కొత్త పార్టీ ఏర్పాటుపై త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డిస్తాన‌ని చెప్పుకొచ్చాడు. నేను రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నా త‌మిళ‌నాడుకు మంచిరోజులేన‌ని జోస్యం చెప్పాడు. సినిమా నుంచి పాలిటిక్స్ లో అనేక మంది యాక్ట‌ర్లు వ‌స్తున్నారని , తానొస్తే త‌ప్పేంటని అన్నారు.

ఈ సంద‌ర్భంగా కావేరీ న‌దీ జ‌లాల వివాదంలో ర‌జ‌నీకాంత్ - క‌మ‌ల్ హాస‌న్ లు క‌ర్నాట‌క‌ను ప్ర‌శ్నించాల‌ని కోరాడు. రైతుల‌కు అన్యాయం జ‌రుగుతుంద‌ని - నీరు లేక త‌మిళ‌నాడు రైతులు అల్లాడుతున్నార‌ని గుర్తు చేశాడు. త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ప్ర‌యాణికుల న‌డ్డి విరుస్తోందని, అధిక ఛార్జీలు పెంచి ప్ర‌జ‌లు ఏం మెసేజ్ ఇవ్వాల‌ని ప్ర‌శ్నించాడు. వెంట‌నే పెంచిన ప్ర‌యాణ ఛార్జీలు త‌గ్గించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశాడు. కోర్కెలు తీర్చే ఇలవేల్పు. కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా వెలుగొందుతున్న మీనాక్షి అమ్మవారి ఆల‌యంలో ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయ‌ని , అలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా చూసుకోవాల‌న్నారు.