Begin typing your search above and press return to search.

కొవిడ్ టీకా తీసుకుంటే బస్సుల్లోకి ఎంట్రీ ..ఎక్కడంటే ?

By:  Tupaki Desk   |   13 Nov 2021 11:41 AM GMT
కొవిడ్ టీకా తీసుకుంటే బస్సుల్లోకి ఎంట్రీ ..ఎక్కడంటే ?
X
ప్రజలంతా కరోనా వైరస్ వ్యాక్సిన్ తీసుకోవడమే లక్ష్యంగా మహారాష్ట్రలోని ఠాణె మున్సిపల్ కార్పొరేషన్ (టీఎంసీ) మరో కఠిన నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ టీకా కనీసం ఒక్క డోసు కూడా తీసుకోని వారిని ప్రభుత్వ బస్సులో ప్రయాణించేందుకు అనుమతించబోమని తెలిపింది. ఈ మేరకు టీఎంసీ మేయర్ నరేశ్ మఖ్సే శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. నవంబర్ చివరినాటికి 100శాతం టీకా అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అది నెరవేరేందుకు తగిన నిర్ణయాలు తీసుకోవడం తప్పనిసరి.

టీఎంసీ పరిధిలో వ్యాక్సిన్ తీసుకోనివారు కనిపిస్తే సమీపంలోని కేంద్రంలో వారికి తక్షణమే టీకా వేస్తాం. ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించే వారు కచ్చితంగా తాము వ్యాక్సిన్ తీసుకున్నట్లుగా ధ్రువపత్రాన్ని చూపించాలి. లేదంటే.. వారిని బస్సులో ప్రయాణించేందుకు అనుమతించం. టీకా తీసుకోని తమ సిబ్బందికి జీతాలు చెల్లించబోమని ప్రకటించిన కొద్దిరోజులకే తాజాగా బస్సు ప్రయాణాలపై ఆంక్షలు విధించింది టీఎంసీ. శుక్రవారం వరకు ఠాణెలో 86,00,118 మందికి టీకా అందించారు. అందులో మొదటి డోసు తీసుకున్నవారు 56,00,856 మంది కాగా.. 29,99,262 మంది రెండు డోసులు తీసుకున్నారు.

దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల టీకా డోసుల పంపిణీలో 100 కోట్ల మైలురాయిని అందుకుంది. అయినా.. కొందరు వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. ఆ జాబితాలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. దీంతో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి సంబంధిత సంస్థలు.