Begin typing your search above and press return to search.
కొత్త వ్యాపారంలోకి ఎంట్రీ.. అంబానీ వర్సెస్ అదానీ
By: Tupaki Desk | 26 Nov 2022 5:30 PM GMTసంచలన నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు అదానీ గ్రూప్ అ అధినేత గౌతం అదానీ.. జెట్ స్పీడ్ తో నిర్ణయాలు తీసుకోవటం.. తమ వ్యాపార సామ్రాజ్యాన్ని ఒకటి తర్వాత ఒకటి చొప్పున విస్తరించుకుంటూ పోవటమే కాదు.. అవసరానికి తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకోవటానికి ఏ మాత్రం వెనక్కి తగ్గని వైనం ఆయన సొంతమని చెప్పాలి. ఆసియా కుబేరుడిగా మారిన ఆయన.. తాజాగా తమ సంస్థ భవిష్యత్తు ప్రణాళికను చెప్పుకొచ్చారు.
అన్నింటికి మించి తాజాగా తాము ఎంట్రీ ఇవ్వబోతున్న వ్యాపారానికి సంబంధించిన కీలక ప్రకటన ఒకటి ఆయన నోటి నుంచి వచ్చింది. ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయనీ విషయాల్ని వెల్లడించటం గమనార్హం. తాజాగా తన వ్యాపార సామ్రాజన్యాన్ని పెట్రో కెమికల్స్ రంగంలోకి విస్తరించనున్నట్లుగా చెప్పారు. ఇప్పటికేఈ రంగంలో తోపుగా చెప్పే రిలయన్స్ కు షాకిచ్చేలా అదానీ నిర్ణయం ఉండటం గమనార్హం.
తాము పెట్రో కెమికల్స్ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నట్లుగా చెప్పారు. సుమారు రూ.32,800 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. ఇందుకోసం భారీగా నిధుల సమీకరణ చేయనున్నారు. దీంతో గుజరాత్ కు చెందిన ఇద్దరు పారిశ్రామిక దిగ్గజాలు ఒకే రంగంలో పోటీకి దిగటం ఆసక్తికరంగా మారింది. రూ.20వేల కోట్ల భారీ ఫాలో ఆన్ పబ్లిక్ ఇష్యూకు సెబీ నుంచి ఆమోద ముద్ర పొందిన విషయాన్ని తెలియజేశారు. దేశంలో ఒక లిస్టెడ్ కంపెనీ ఇంత భారీ ఎఫ్ పీవోకు రావటం ఇదే తొలిసారిగా పేర్కొంటున్నారు.
వ్యాపార విస్తరణలో భాగంగానే ఈ ఎఫ్ పీవోలను చేపట్టినట్లుగా గౌతమ్ అదానీ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.. ఈ మధ్యన కొనుగోలు చేసిన ఎన్డీటీవీ మీడియా సంస్థను కొనుగోలు చేయాల్సిన అవసరం ఏమిటన్న విషయంపైనా క్లారిటీ ఇచ్చారు.
వ్యాపార దృష్టితో కాకుండా ఒక 'బాధ్యత'గా మాత్రమే ఎన్‌డీటీవీని కొనుగోలు చేసినట్లుగా చెప్పిన అదానీ.. ఈ మీడియా సంస్థను అంతర్జాతీయ దిగ్గజంగా తీర్చిదిద్దటమే తమ లక్ష్యమన్నారు. అంతేకాదు.. ఎన్డీటీవీకి ప్రమోటర్లుగా వ్యవహరించే ప్రణయ్ రాయ్.. రాధికారాయ్ లు తమ గ్రూపుతో కలిసి నడవాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. మరేం జరుగుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.