Begin typing your search above and press return to search.

ఇక తెలంగాణలోకి ఎంట్రీ ఫ్రీ.. నో బ్రేక్స్

By:  Tupaki Desk   |   20 Jun 2021 10:14 AM GMT
ఇక తెలంగాణలోకి ఎంట్రీ ఫ్రీ.. నో బ్రేక్స్
X
కరోనా లాక్ డౌన్ వేళ ఆంధ్రా నుంచి వచ్చే ప్రజలు, రోగులను తెలంగాణలోకి రాకుండా అడ్డుకోవడం పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే.. తెలంగాణ హైకోర్టు సైతం ఈ చర్యను ఖండించింది. తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసింది. అయినా కూడా ఆంధ్రా రోగులను, ప్రజలను ‘ఈపాస్’ ఉంటేనే రాష్ట్రంలోకి అనుమతించారు తెలంగాణ పోలీసులు. అయితే తెలంగాణ రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది.

దీంతో తెలంగాణ సరిహద్దుల్లో అర్ధరాత్రి నుంచి ఆంక్షలు కూడా ఎత్తివేస్తున్నట్టు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ క్రమంలోనే ఏపీ -తెలంగాణ సరిహద్దుల్లో వాహనాలు యథావిధిగా రాకపోకలు సాగిస్తున్నాయి.

ప్రభుత్వం లాక్ డౌన్ ను ఎత్తివేయడంతో ఆది వారం నుంచి ఆర్టీసీ బస్సులు పూర్తి స్థాయిలో నడుస్తాయని ప్రకటించినప్పటికీ ఒక్క అంతర్రాష్ట్ర బస్సులు కూడా రాకపోకలు సాగించలేదు. దీంతో హైదరాబాద్ కు వచ్చే ఇతర రాష్ట్రాల వారు సందిగ్ధంలో పడ్డారు.

శనివారం అర్ధరాత్రి దాటాక ఇక తెలంగాణ సరిహద్దుల్లో ఆంక్షలు ఎత్తివేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటన రిలీజ్ చేసింది. దీంతో ఇక తెలంగాణలోకి ఏ రాష్ట్రం నుంచి అయినా రాకపోకలు సాగనున్నాయి.

ఇక ఏపీలో మాత్రం కర్ఫ్యూ కొనసాగుతోంది. గరికపాడు చెక్ పోస్టు వద్ద ఆంక్షలు కొనసాగుతున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే ఏపీలోకి అనుమతిస్తున్నారు. ఈపాస్ ఉంటేనే ఆంధ్రా పోలీసులు రానిస్తున్నారు. అంతర్రాష్ట్ర రవానా కూడా మళ్లీ మొదలు కానుంది.